ఘాటెక్కిన మిర్చి ధర

ABN , First Publish Date - 2020-03-04T11:12:34+05:30 IST

ఘాటెక్కిన మిర్చి ధర

ఘాటెక్కిన మిర్చి ధర

క్వింటాలుకు రూ. 20వేలు పలుకుతున్న వైనం

జిల్లాలో గణనీయంగా తగ్గిన మిర్చి సాగు

 

బోధన్‌, మార్చి 3: ఎం డు మిర్చి ధర భగ భగ మంటోంది. ఈ ఏ డాది మిర్చి ధర వినియోగ దారులకు గాటెక్కించనుంది. మిర్చి ధర క్వింటాలుకు రూ. 20వే ల వరకు ధర పలుకుతుండడం ఆందో ళన కలిగిస్తోంది. మిర్చి ధరల భగభగ వి నియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో మిర్చి పంట సాగు గణనీ యంగా తగ్గుముఖం పట్టడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్‌, కామా రెడ్డి జిల్లాల పరిధిలో మిర్చి పంట బోధన్‌, రెంజల్‌ మండ లాలతో పాటు బాన్సువాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో మిర్చి పంట సాగవుతోంది. మిర్చి పంట సాగు చేసేందుకు అను వుగా ఉన్న నేలల్లో ఈ పర్యాయం రైతులు మిర్చి పంట వేసేందుకు ఆసక్తి చూపలేదు. మిర్చి పంట సాగు చేయ డం కష్టతరం కావడంతోపాటు పెట్టుబడులు అధికంగా ఉండడం, వ్యాధులు అధికంగా సోకుతుండడం దిగుబ డులు సైతం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడా ది రైతులు మిర్చి పంట సాగుకు దూరమయ్యారు. గతంతో పోలిస్తే సగా నికి సగం మిర్చిపంట సాగు విస్తీ ర్ణం తగ్గిపోవడంతో మిర్చిసాగు కరువైంది. దీనికి తోడు ప్ర తి యేటా మిర్చిపంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదర గాలులు మిర్చి పంటను తీవ్రంగా దెబ్బతిస్తూ వస్తుంది. గత 15యేళ్లుగా ప్రతీ యేటా మిర్చి పంట కో త మొదలుకొని ఆర బెట్టే వరకు అకాల వర్షాలు, వడగళ్ల వానలు వెంటాడుతున్నా యి. ఈ పరిణామాలు మిర్చి సాగు చేసి న రైతులను తీవ్రంగా దెబ్బతిస్తూ వచ్చాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెడితే వడగళ్ల వానలు, అకాల వర్షాల వల్ల మిర్చిపంట నేలపాలవుతుం డడంతో రైతులు మిర్చిసాగుకు దూరమయ్యారు. బోధన్‌ మండలంలోని చిన్నమావంది, పెద్దమావంది, జాడీ, బండా రుపల్లి, కల్దూర్కి, రాంపూర్‌, ఖండ్‌గాం, కొప్పర్గ, హంగర్గ, సిద్దాపూర్‌, రెంజల్‌ మండలంలోని కందకుర్తి, నీలా, సాటాపూర్‌ శివారులలో వంద లాది ఎకరాలలో సాగయ్యే మిర్చి పంట ఈ ఏడాది కనుమ రుగైంది. ఉమ్మడి జిల్లాలో మిర్చి కోసం చిన్నమావంది, పెద్దమావంది గ్రామాలకు రై తులు తరలివచ్చే పరిస్థితులుండగా ఈ ఏడాది అర కొరగా మిర్చిసాగులో ఉంది. మిర్చి పంట సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోవడంతో మిర్చి పంటకు డిమాండ్‌ నెలకొ ంది. గత 15 రోజులుగా మిర్చి కోతలు మొదలై ఎండు మి ర్చి మార్కెట్‌లో విక్రయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మిర్చి పంట క్వింటాలుకు 20వేల వరకు ధర పలుకుతుం డడం మిర్చి కొనే రైతులకు గాటు పుట్టిస్తోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది మిర్చి పంట ధర క్వింటాలుకు రూ. 5 వేలకు పైనే అదనంగా ఉంది. మిర్చి సాగు చేసిన రైతు లకు లాభాలు వచ్చే పరిస్థితులుండగా కొనే వారికి మా త్రం కంటతడి తప్పేలా లేదు. జిల్లాలో సాగు విస్తీర్ణం లేక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి మిర్చి విక్రయదారులు బోధన్‌ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. 


విస్తీర్ణం గణనీయంగా తగ్గింది - విఠల్‌రావు, రైతు, పెద్దమావంది

మిర్చి పంట విస్తీర్ణం ఈ ఏడాది గ ణనీయంగా తగ్గింది. జిల్లాలో మిర్చి పంట సాగుకు పెద్దమావంది, చిన్న మావంది అడ్డాలు కాగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రైతులు పంటను సాగు చేయలేదు. దీంతో మిర్చి ధర పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెరగడం వ్యాధులు రావడం వల్ల రైతులు పంట సాగుకు దూరమయ్యారు. 


నష్టాల వల్ల మిర్చికి దూరమయ్యాం - గంగారం, రైతు, చిన్నమావంది

మిర్చి పంట సాగు చేస్తే పెట్టుబడు లు అధికమై నష్టాలు రావడం వల్ల  పంటకు దూరమయ్యాం. ఈ ఏడాది మిర్చిని వదిలి వరి పంట సాగు చేశా ను. మిర్చి రైతులకు ప్రతి యేటా కష్టాలు తప్పడం లేదు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు దెబ్బ తీయడంతోపాటు లాభాలు లేకపోవడంతో ఈ ఏడాది రైతులు మిర్చిని సాగు చేయలేదు. 


గుంటూరు నుంచి తెచ్చి అమ్ముతున్నా - భరణికుమార్‌, మిర్చి వ్యాపారి

జిల్లాలో మిర్చి పంట సాగు ఆశించి న స్థాయిలో లేకపోవడంతో గుంటూ రు నుంచి మిర్చిని తెచ్చి అమ్మకాలు చేస్తున్నా. ప్రస్తుతం మిర్చి ధర క్వింటా లుకు 18వేల నుంచి 20వేల వరకు ఉంది. తేజ, చంద్రముఖి, గుంటూరు మిర్చి, నెంబరు 5 మి ర్చి ఇలా ఒక్కో రకానికి ఒక్కో ధర పలుకుతుంది. 

Updated Date - 2020-03-04T11:12:34+05:30 IST