మార్పు దిశగా పట్టణ ప్రగతి

ABN , First Publish Date - 2020-03-02T11:39:50+05:30 IST

మార్పు దిశగా పట్టణ ప్రగతి

మార్పు దిశగా పట్టణ ప్రగతి

కదిలిన అధికారులు, ప్రజాప్రతినిధులు 

 సమస్యలపై నివేదికలు


నిజామాబాద్‌, మార్చి 1  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ఊపం దుకుంది. మొదట నామమాత్రంగానే మొద లైనా కలెక్టర్‌తోపాటు ఇతర అఽధికారులు అ న్ని మున్సిపాలటిల్లో పర్యటిస్తున్నారు. చెత్తను తొలగించడంతోపాటు డ్రైనేజీల కార్యక్రమాల ను చేపడుతున్నారు. షెడ్యూల్‌కు అనుగుణం గా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సమ స్యలను అధ్యాయనం చేయడంతోపాటు నివే దికలను తయారు చేస్తున్నారు. మున్సిపాలి టీలకు అనుగుణంగా సమస్యలను గుర్తించి పనులు చేయడంతోపాటు నిధుల కోసం ప్ర భుత్వానికి  పంపించేందుకు ఏర్పాట్లను చే స్తున్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీ పరిధిలో   షెడ్యూల్‌ ప్రకారం కార్పొరేటర్‌లు, కౌన్సిలర్లు, అధికారులు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొం టున్నారు.  ప్రఽధానంగా డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు. కాలనీల్లో ఉన్న చెట్ల పొదలను, తుప్పలను  తొలగిస్తున్నారు. కాలువలు దెబ్బ తిన్న చోట ప్రత్యామ్నయంగా చర్యలు చేపడు తున్నారు. గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి లాగా ప్రజల భాగస్వామ్యం మాత్రం ఎక్కు వగా పట్టణ  ప్రగతిలో కనిపించడం లేదు. కొన్ని కాలనీల్లో ప్రజలు ముందుకు వస్తున్న మెజారిటీ కాలనీల్లో మాత్రం రావడం లేదు. స్వచ్ఛంద సంస్థల పాత్ర కూడా తక్కువగానే ఉంది. అవసరమైన మేరకు నిధులను వెచ్చి స్తూ పనులను పూర్తి చేస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీల్లో పార్కు స్థలాల గుర్తింపు, పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటు కు స్థలాల గుర్తింపు, వాణిజ్య అవసరాలకు ప్రభుత్వ స్థలాల పరిశీలన, డంపింగ్‌ యా ర్డులకు స్థలాల గుర్తింపు, ఉన్న స్థలాల్లో అవ సరం మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్మశాన వాటికలను బాగుచేయడంతోపాటు కొత్త శ్మశాన వాటికలకు  స్థలాలను గుర్తించే కార్య క్రమాన్ని చేపడుతున్నారు. అన్ని వార్డుల పరి ధిలో సమస్యలను గుర్తించే ప్రయత్నాలను చేస్తున్నారు. కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలి టీల్లో ఓపెన్‌ జీమ్‌లను ఏర్పాటు చేసేందుకు స్థలాల పరిశీలన చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ తరఫున కరెంటు లూజ్‌  వైర్లను గుర్తించి సరి చేస్తున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పా టు చేస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డితో పా టు ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, జీవన్‌రె డ్డి, షకీల్‌ అమీర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ పలు కా ర్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కలెక్టర్‌ సి.నారా యణరెడ్డి ఈ నాలుగు మున్సిపాలిటీల పరిధి లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నాలు గు మున్సిపాలిటీల పరిధిలో ఎప్పటికప్పుడు అధికారులతో కలెక్టర్‌ సమీక్షిస్తున్నారు. అవస రమైన సూచనలు చేస్తున్నారు. పట్టణ ప్రగ తిలో అధికారులందరూ పాల్గొనే విధంగా ఆ దేశాలు ఇస్తూనే ప్రజాప్రతినిధులు పాల్గొనే విధంగా చేస్తున్నారు. కార్యక్రమాలు ప్రశాం తంగా కొనసాగే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అవసరమైన మేరకు నిధుల స మీకరణ చేస్తున్నారు. డివిజన్‌లు, వార్డులను కలెక్టర్‌ తనిఖీ  చేస్తున్నారు. నగర మేయర్‌తో పాటు మూడు మున్సిపాలిటిల ఛైర్మన్‌లు కూడా కార్యక్రమంలో భాగం పంచుకంటు న్నారు. పట్టణ ప్రగతి విజయవంతం చేసేం దుకు చర్యలు  చేపడుతున్నారు. స్థానిక సం స్థల అదనపు కలెక్టర్‌ లత, కార్పొరేషన్‌ కమి షనర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఆర్డీవోలు పాల్గొం టున్నారు. ప్రతిపక్ష ప్రతినిధుల భాగస్వా మ్యం మాత్రం కొంతమేరకు తక్కువగానే ఉంది. ఈ నెల మూడున హరితాహారం కా ర్యక్రమాన్ని నాలుగు మున్సిపాలిటీల్లో భారీగా చేసేందుకు ఏర్పాట్లను అధికారులు చేస్తున్నా రు. నివేదికలు తయారు చేశారు. పట్టణ ప్ర గతి నిరంతర ప్రక్రియగా కొనసాగితే మున్సి పాలిటిల్లో భారీ మార్పు రానుంది.

Updated Date - 2020-03-02T11:39:50+05:30 IST