గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2020-03-02T11:37:18+05:30 IST

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చి 1: రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్‌ చైౖర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాల యాన్ని ఆయన తనిఖీ చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని వివిధ విభా గాలను పరిశీలించారు. పాఠకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్‌లో ఏవైనాపుస్తకాలు  కొత్తవిగా కనిపించి గ్రంథాలయంలో అందుబాటులో లేకపోతే అధికారులతో మాట్లాడి తెప్పించు కునే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ, ప్రభుత్వం పోటీ పరీక్షల్లో విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. మౌలిక వసతులతో పాటు విద్యార్థు లకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తుందన్నా రు. గతంలో మాక్లూర్‌ శాఖ గ్రంథాలయం భవన నిర్మాణానికి కావాల్సిన నిధు లను రూ.16లక్షల 60వేలు, వెల్మల్‌ శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి 20 లక్షలు, బోధన్‌ గ్రంథాలయ భవన మరమ్మతులకు రూ.4లక్షలు మొత్తం రూ. 40లక్షల 10వేలను పరిపాలన అనుమతిని ఇచ్చామన్నారు. జిల్లా నుంచి వచ్చే ప్రతిపాదనలు ఇంజనీరింగ్‌ విభాగం చేత సర్వే చేయించి అందుకు అవస రమైన నిధులను కేటాయిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా గ్రంథాలయ సిబ్బంది చూసుకోవాలని ఆదేశిం చా రు. గ్రామపంచాయతీలు, మున్సిపల్‌, కార్పొరేషన్‌ పన్ను వసూళ్లలో గ్రం థా లయ సెస్సు నిబంధనల ప్రకారం సంస్థకు చెల్లించినట్లయితే గ్రంథాలయాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. మాజీ ఎంపీ కవిత విద్యార్థుల కోసం ప్రారంభించిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో  అసిస్టెంట్‌ లైబ్రెరియన్‌, సిబ్బంది రాజ్‌మహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-03-02T11:37:18+05:30 IST