త్రిశంకు స్వర్గంలో..ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు

ABN , First Publish Date - 2020-06-25T11:11:44+05:30 IST

ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు త్రిశం కు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.

త్రిశంకు స్వర్గంలో..ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు

పరీక్షలు లేవు... ప్రమోట్‌ లేదు

మరోవైపు డిగ్రీలో ప్రవేశానికి షెడ్యూల్‌ విడుదల 

విద్యా సంవత్సరం నష్టపోతామని ఆందోళన 

ఉమ్మడి జిల్లాలో 2.403 మంది విద్యార్థులు


ఆర్మూర్‌, జూన్‌ 24: ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా వల్ల పరీక్షలు జరగలేదు. మరోవైపు డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ షెడ్యూల్‌ విడుదల కావడంతో తాము పైచదువులు చదివే అవకాశం లేకూండా పోతోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చదువు మధ్యలో మానివేసిన విద్యార్థుల చదువులు కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టింది. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారు రెగ్యులర్‌ టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల మా దిరిపై చదువులకు వెళ్లవచ్చు. ప్రతీ ఏడు పదోతరగతి పరీక్షల తరువాత ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు నిర్వ హిస్తారు. ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఓపెన్‌ ఇంటర్‌ స్టడీ సెంటర్‌లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 2403 మంది విద్యార్థులు ఓపెన్‌ ఇంటర్‌ చదువుతు న్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణులైతే డిగ్రీలో ప్రవేశం తీసుకొనే అవ కాశం ఉంది.


కానీ కరోనా వల్ల పరీక్షలు నిర్వహించనందున వీరిని ఎలా ఉత్తీర్ణులను చేయాలన్న నిర్ణయం రాష్ట్ర ప్ర భుత్వం తీసుకోలేకపోయింది. కరోనా ప్రభావం కంటే ముందే రెగ్యులర్‌ ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఫలితాలు కూడా ప్రకటించారు. ఇంటర్‌ ఫలితాలు వెలువడడంతో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ షెడ్యూల్‌ విడులైంది. ఓపెన్‌ ఇం టర్‌ పరీక్షలు జరగనందున డిగ్రీలో ప్రవేశానికి అర్హత కో ల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవ సరం ఉంది. పరీక్షలు నిర్వహిండమా, అందరినీ ఉత్తీర్ణుల ను చేయడమా అనే నిర్ణయం త్వరగా తీసుకోవాలని వి ద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు పాతిక వేలపైనే ఉన్నారు. 


టెన్త్‌ విద్యార్థులది అదే పరిస్ధితి..

ఓపెన్‌ టెన్త్‌ విద్యార్థుల పరిస్ధితి అదే విధంగా తయా రైంది. రెగ్యులర్‌ విద్యార్థులన పరీక్షలు లేకుండా పాస్‌ చే సినప్పటికీ ఓపెన్‌ టెన్త్‌ విద్యార్థుల విషయంలో ప్రభు త్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. రెగ్యులర్‌ పదో తరగతి పరీక్షలు మూడు జరిగిన తరువాత హైకోర్టు సూచన మేరకు వాయిదా వేశారు. మళ్లీ ఈ నెల 8 నుంచి పరీక్ష లు నిర్వహించాలని షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు రద్ధు చేశారు. ఇంటర్‌నల్‌ పరీ క్షలు ఎఫ్‌ఏలో వచ్చిన మార్కుల ఆధారంలో గ్రేడ్‌లు నిర్ణ యించారు. రెండు రోజుల క్రితం విద్యార్థుల గ్రేడ్‌లు కూ డా ప్రకటించారు. ఓపెన్‌ టెన్త్‌ విద్యార్థులకు ఇంటర్‌నల్‌ పరీక్షలు లేవు. దూర విద్యావిధానం కావడం వల్ల నేరుగా ఫైనల్‌ పరీక్షలు ఉంటాయి. ఈ విద్యార్థులను నేరుగా పాస్‌ చేయాల్సి ఉంటుంది. లేదా పరీక్షలు నిర్వ హించా లి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా లో టెన్త్‌ విద్యార్థులు 3548 మంది ఉన్నారు. ఇందులో నిజామా బాద్‌ జిల్లాలో 1957, కామారెడ్డి జిల్లాలో 1591 మంది విద్యార్థులు ఉన్నారు. 


ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది...తుల రవీందర్‌, జిల్లా కోఆర్డినేటర్‌  

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల విషయమై రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏ నిర్ణయం తీసుకు న్నా సిద్ధంగా ఉన్నాం. ప్రతీయేడు ఏప్రిల్‌ నెలలో పరీక్షలు జరుగుతాయి. ఈసారి కరోనా వల్ల వాయిదా పడ్డాయి.

Updated Date - 2020-06-25T11:11:44+05:30 IST