భగీరథ నీరందేనా?

ABN , First Publish Date - 2020-03-12T09:01:55+05:30 IST

ఇంటింటికీ తాగునీరందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీ రథ ఇంట్రావిలేజ్‌ పనులు జిల్లాలో ఇంకా

భగీరథ నీరందేనా?

 జిల్లాలో నత్తనడకన సాగుతున్న మిషన్‌ భగీరథ పనులు 

ముంచుకొస్తున్న వేసవి.. పడిపోతున్న భూగర్భ జలాలు

 మొదలైన తాగునీటి కష్టాలు

ఎల్లారెడ్డి టౌన్‌, మార్చి 11: ఇంటింటికీ తాగునీరందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీ రథ ఇంట్రావిలేజ్‌ పనులు జిల్లాలో ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇంటింటికీ నీరందిస్తా      మన్న ప్రభుత్వ హామీ ఏళ్ల తరబడిగా నెరవే రడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు వేసవి కాలం.. మరోవైపు భూగర్భ జ లాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ పథకం ద్వారా ఇంటింటికి నీరు ఎప్పుడు అందుతుందోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతు న్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపే ప్రతీ బహిరంగ సభలో ఇంటిం టికీ నీరందిస్తామని ప్రకటించింది.


తీరా ప్ర భుత్వంలోకి వచ్చి, రెండో సారి జరిగిన అసెం బ్లీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధి కారాన్ని చేపట్టింది. వరుసగా రెండు సార్లు టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మి షన్‌ భగీరథ తీరు మాత్రం మారడం లేదు. జిల్లా వ్యాప్తంగా మిషన్‌ భగీరఽథ అధికారులు పనుల్లో వేగం పెంచినప్పటికి నేటికి పూర్తి స్థాయిలో మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికీ చే రకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో 827 ఆవాసాలను కలుపుకొని సుమా రుగా రూ. 1,600కోట్లతో చేపడుతున్న పను లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వేసవి కాలంలో నీటి కోసం జిల్లా ప్రజలు అల్లాడి పోయారు. చాలా చోట్ల నీటికోసం ఖాళీ బిందె లతో మహిళలు రోడ్డెక్కిన సంఘటనలు జరి గాయి. అయినప్పటికీ నేటికి మిషన్‌ భగీరథ ఇంట్రా విలేజ్‌ పనులు పూర్తి కాకపోవడం ప ట్ల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా యి. సాధ్యమైనంత త్వరగా ఇంట్రావిలేజ్‌ ప నులు పూర్తి చేసి ప్రజలకు వేసవిలో తాగునీ టి ఇబ్బందులు తలెత్తకముందే ప్రజలకు స్వ చ్ఛమైన తాగునీటిని అందించాలని వారు అ ధికారులను వేడుకుంటున్నారు. కాగా ఈ నెల చివరికల్లా పెండింగ్‌లో ఉన్న పనులను కాస్త పూర్తి చేసి, ఇంటింటికి ఏప్రిల్‌ నుంచి నీటిని అందిస్తామని మిషన్‌ భగీరథ అధికారులు ధీ మాను వ్యక్తం చేస్తున్నారు.

 ఊడుతున్న నల్లాలు

జిల్లాలో మిషన్‌ భగీరథ పనులను చేపట్టి సుమారుగా ఐదేళ్లు గడిచిపోతున్నా.. ఇంకా ఆ పనులు పూర్తి కాకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో ఇప్ప టి వరకు వాటర్‌ గ్రిడ్‌ పనులు పూర్తి అయి నప్పటికీ ఇంట్రావిలే జ్‌ పనులు మాత్రం నేటి కీ పూర్తి కావడం లేదని, ఇంటింటికి నీరు రా వడం లేదని, నల్లాలు బిగించిన వాటి నుంచి చుక్క నీరు రావడం లేదని ప్రజలు పేర్కొం టున్నారు. కాగా కామారెడ్డి జిల్లాలో సుమారు గా 1,600కోట్ల రూపాయలతో అంతర్గత పైప్‌ లైనులు, వాటర్‌ ట్యాంకుల నిర్మాణాలను చేప డుతున్నారు. 2,200 కిలోమీటర్లను దాటుకొని 827 ఆవాసాల ద్వారా ఇంటింటికీ మిషన్‌ భగీ రథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా ను చేయాల్సి ఉంది.


ఇందులో ఇప్పటికే ఇం టెక్‌వెల్‌, పంపు హౌస్‌లు, సంప్‌లు, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు, ఓవర్‌హెడ్‌ బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ ట్యాంకులు, పైప్‌లైన్లు వంటి ప నులు ఇదివరకే పూర్తి అయ్యాయి. ఒక్క ఎ ల్లారెడ్డి నియోజకర్గంలోని ఎల్లారెడ్డి, లింగంపే ట, నాగిరెడ్డిపేట మండలాలలోనే గ్రిడ్‌ పను లు వందశాతం గతేడాది పూర్తి అయ్యింది. కా నీ ఇంట్రావిలేజ్‌ పనులు మాత్రం ఇంకా కొన సాగుతున్నాయి. మొత్తం జిల్లాలో 2,200 కిలో మీటర్ల పనులు పూర్తి చేయాలని లక్ష్యం పె ట్టుకోగా, ఇప్పటి వరకు 80శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక వాటర్‌ ట్యాంకు లు 603 నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉండ గా, ఇప్పటివరకు ఈ వాటర్‌ ట్యాంకుల ని ర్మాణాలు పూర్తి చేశారు.

నీరు సరఫరా అయ్యేనా ?

జిల్లా వ్యాప్తంగా ఈ నెల చివరికల్లా పను లు పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్‌ నుం చి తాగునీటిని అందిస్తామని అధికారులు ధీ మాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతీ వేస విలో నీటికోసం ప్రజలు అల్లాడిపోయే పరిస్థి తులు చూస్తూనే ఉంటాం. చెరువులు ఎండు ముఖం పట్టడం, బోర్లు వట్టిపోయడంతో వీ రు నీటి కోసం గతంలో ప్రజలు నానా కష్టా లు పడ్డారు. అయితే వర్షాకాలంలో కురిసిన కొద్దిపాటి వర్షాలతో భూగర్భజలాలు కాస్త పె రిగాయి. బోర్లు నీటిని గ్యాప్‌ లేకుండా పోస్తు న్నాయి. ఈ ఏడాది యాసంగిలో జిల్లాలో వరి పంటను రెట్టింపు స్థాయిలో సాగు చేయడం తో నీటి వాడకం ఎక్కువైంది. దీంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి.


ఈ ప నులు పూర్తి స్థాయిలో అవకపోవడం, ఈ వే సవిలో మండుతున్న ఎండలు, రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలాలతో పల్లెల్లో నీటి కష్టాలు ఇప్పటికే పలుచోట్ల మొదలయ్యాయి. బోర్లు వట్టిపోస్తుండడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప లు గ్రామాలలో ప్రజలు తాగునీటికోసం ఇ బ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో మిషన్‌భగరీఽథ వాటర్‌గ్రిడ్‌ పైప్‌లైన్‌ల నుంచి నల్లా కనెక్షన్లు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చు తున్నప్పటికీ మిగతా ప్రాంతాలలో తాగునీటి కోసం కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇప్ప టికైనా మిషన్‌భగీరథ అధికారులు త్వరితగతి న పనులు పూర్తిచేసి ఇంటింటికీ నల్లా కనెక్ష న్లు ఇచ్చి తమ తాగునీటి కన్నీటి కష్టాలు తీ ర్చాలని అధికారులను ప్రజలు వేడుకుంటు న్నారు.


ఇంకా వేసవి కాలం జోరందుకోక ముందే ఇంలాంటి పరిస్థితి నెలకొన్నదని ఇం కా రాబోయే రోజుల్లో సమస్యతీవ్రత పెరిగే అ వకాశాలున్నాయని పరిస్థితులను బట్టి తెలు స్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో పనులు పూర్తి చే స్తే సమస్య తీవ్రతను తగ్గించవచ్చని పలువు రు పేర్కొంటున్నారు. కానీ మిషన్‌ భగీరథ ద్వారా నీటిని అందిస్తామని చెప్పిన అధికారు లు నేటి వరకు నీటిని అందించకపోవడం ప ట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిషన్‌ భ గీరథ ద్వారా తాగునీరందించేందుకు సింగూర్‌ ప్రాజెక్టు నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధి లోని మండలాలలకు, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా ఇతర మండలాలకు ఏప్రిల్‌ నుంచి నీ టిని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యి. 

ఏప్రిల్‌ నుంచి మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ నీటిని అందిస్తాం..

కామారెడ్డి జి ల్లాలో మిషన్‌ భ గీరథ ద్వా రా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని ఏప్రిల్‌ నుంచి అందించేందుకు అవసర మయ్యే అ న్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గ్రిడ్‌ పనులు పూర్తి చేశాం.

లక్ష్మీనారాయణ, మిషన్‌భగీరథ ఈఈ

ఇంకా నల్లాలను బిగించలేదు

ఎల్లారెడ్డి పట్టణంలోని 9వ వార్డులో  ఇప్ప టికీ మిషన్‌ భగీరథ గ్రిడ్‌ మేన్‌ పైప్‌ లైన్‌ ప నులు, ఇంట్రా విలేజ్‌ పనులు కానీ చేయలే దు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లాను బి గించినప్పటికీ మా ప్రాంతంలో మాత్రం నలా ్లను ఇంకా బిగించలేదు. 

అతీక్‌ అలీ, స్థానికుడు, ఎల్లారెడ్డి


Updated Date - 2020-03-12T09:01:55+05:30 IST