నేడో, రేపో నీటి విడుదల నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-23T10:45:11+05:30 IST

నేడో, రేపో నీటి విడుదల నిలిపివేత

నేడో, రేపో నీటి విడుదల నిలిపివేత

నిజాంసాగర్‌, మార్చి 22: ఉభయ జిల్లాల వర ప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాల్వ నీటి విడుదలను నేడో, రేపో అధి కారులు నిలిపివేయనున్నారు. ఈ నెల 18వ తేదిన నిజాంసాగర్‌ నీటి ని ప్రధాన కాల్వ ద్వారా 89 వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చే శారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న సాగునీటిని ఈ నెల 23, 24 తేదిల్లో నిలిపివేయనున్నట్లు సమాచారం. నిజాంసాగ ర్‌ ప్రాజెక్టు నుంచి ఉభయ జిల్లాలకు సాగునీరు రెండు విడతలుగా విడుదల చేశారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా 1250 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్‌లో 1405 అడుగులకు గాను 1380 అడుగులు నీటి సామర్థ్యం కలిగి 1.310 టీఎంసీల నీరు నిల్వ ఉందని డిప్యూటీ ఈఈ దత్తాత్రేయ తెలి పారు. ఈ యేడాది నిజాంసాగర్‌ ఆయకట్టు కింద దాదాపు 95 వేల ఎకరాల్లో యాసంగిలో వరి పంటలు వేశారు. మరో నెల రోజుల్లోగా వరి పైరు చేతికి వస్తుందని రైతులు పేర్కొన్నారు.

Updated Date - 2020-03-23T10:45:11+05:30 IST