రాంపూర్‌లో యువకుల ప్రతిజ్ఞ

ABN , First Publish Date - 2020-03-23T10:52:48+05:30 IST

రాంపూర్‌లో యువకుల ప్రతిజ్ఞ

రాంపూర్‌లో యువకుల ప్రతిజ్ఞ

డిచ్‌పల్లి, మార్చి 23: ప్రాణంతకరమైన కరోనా వైరస్‌ను తరిమికొడదాం అంటూ డిచ్‌ పల్లి మండలంలోని రాంపూర్‌ గ్రామ యువ కులు ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం రాంపూర్‌ నెహ్రూ యువకేంద్రం, ఇందూరు యువత అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలను  ప్రజ లకు అవగాహన కల్పించారు. అలాగే జనతా కార్ఫ్యూలో 24 గంటల పాటు భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ యువకులకు కరోనా వైరస్‌పై అవగా హన పత్రాలు,  మాస్క్‌లను అందజేశారు.

Updated Date - 2020-03-23T10:52:48+05:30 IST