జిల్లా పరిషత్‌లకు ఊరట.. 15 వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు

ABN , First Publish Date - 2020-03-12T09:04:15+05:30 IST

స్థానిక సంస్థల కు నిధులు లేవని, ఉత్సవ విగ్రహాలుగా మారామని, తాము గ్రామాల్లో ఎలాంటి అ భివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని, నీ

జిల్లా పరిషత్‌లకు ఊరట.. 15 వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు

కామారెడ్డి, మార్చి 11: స్థానిక సంస్థల కు నిధులు లేవని, ఉత్సవ విగ్రహాలుగా మారామని, తాము గ్రామాల్లో ఎలాంటి అ భివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని, నీ టి ఎద్ధడి నివారణకు, చిన్నచిన్న పనులనూ చేయలేక ముఖం చాటేస్తున్నామని, ఈ ప దవులు ఎందుకని ఐదేళ్లుగా ఆందోళనకు గురవుతున్న స్థానిక సంస్థల ప్రజాప్రతిని ధులకు కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఊరటని స్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రా మ పంచాయతీలతోపాటు మండల, జిల్లా పరిషత్‌లకు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం తోస్థానిక సంస్థలకు కొత్త కళ రానుంది. ఐ దేళ్లుగా నిధుల లేమితో నీరసించిన జిల్లా, మండల పరిషత్‌లు త్వరలోనే పూర్వ వైభ వం సంతరించుకోనున్నాయి.


కొన్నేళ్లుగా ని ధులు లేక ఇబ్బందులు పడుతున్న స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగిం చింది. ఈ ఏడాది నుంచి 15వ ఆర్థిక సం ఘం నిధులను గ్రామ పంచాయతీలతో పా టు పరిషత్‌లకు ఇవ్వాలని నిర్ణయం తీసు కుంది. ఇందుకు తలసరి గ్రాంటుకు కేంద్రం ఆమోదం తెలపగా.. ఇక నుంచి గ్రామ పం చాయతీలతోపాటు జిల్లా, మండల పరిషత్‌ లకు మూడు విడుతలుగా నిధులు మం జూరు చేయనున్నారు. కేంద్రం ఇచ్చే నిధుల కు సమానంగా రాష్ట్రం వాటాగా మ్యాచింగ్‌ గ్రాంటు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూ డా సుముఖత వ్యక్తం చేయడంతో స్థానిక సంస్థలకు పూర్వ వైభవం రానుంది. దీంతో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

తాగునీటి వనరులకు మోక్షం

కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి జిల్లా, మండల పరిషత్‌లకు 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిపేసింది. ఫలితంగా గ్రామాల్లో రక్షిత నీటి సరఫరా, చేతిపంపుల నిర్వహణ, సున్నం, బ్లీచింగ్‌ కొనుగోలు, వీధి దీపాల ని ర్వహణ కష్టంగా మారింది. ప్రతీ నెల గ్రా మ పంచాయతీ నుంచి మండల, జిల్లా పరి షత్‌ అధికారులు నిధులు అడిగి తీసుకొని నీటి వనరుల నిర్వహణ చేపడుతున్నారు. కొంత మంది సర్పంచ్‌లు నిధులు ఇవ్వకుం డా పేచీ పెట్టడంతో కార్మికులకు వేతనాలు చెల్లించడంతో జాప్యం నెలకొంటోంది. మరో పక్క పైపులైన్ల లీకేజీ మరమ్మతులు చేయ డం పరిషత్‌లకు భారంగా మారింది.

తగ్గనున్న నిధుల వాటా..

2015కు ముందు పరిషత్‌లకు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలలకోసారి విడు దల చేసేది. ఉమ్మడి జిల్లాకు రెండు ప్రభు త్వాల నిధులు సుమారు యేటా రూ.100 కోట్లకు పైగా మంజూరయ్యాయి. వాటిల్లో ఆర్థిక సంఘం నిధులతోపాటు తలసరి గ్రాంటు, బీఆర్‌జీఎఫ్‌, రాష్ట్ర ప్రభుత్వం వా టా ఉండేది.


ఈ నిధులతో పాఠశాలల్లో మౌ లిక వసతులు, నిర్వహణ, మంచినీటి సరఫ రా, చేతిబోర్ల నిర్వహణ, కార్మికుల వేతనా లు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రా లు, రోడ్ల మరమ్మతులు, పారిశుధ్యం వంటి పన ులు చేపట్టేవారు. గ్రామ పంచాయతీకి 50శాతం, మండల పరిషత్‌లకు 30, జిల్లా పరిషత్‌కు 20శాతం నిధులు మంజూరయ్యే వి. 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రం పరిషత్‌లకు తగ్గించి మంజూరు చేసే అవ కాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు అ భిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మండల పరిషత్‌లకు 10, జిల్లా పరిషత్‌ల కు 5శాతం చొప్పున నిధులు మంజూరు చే స్తారనే ప్రభుత్వ నిర్ణయంతో ప్రజాప్రతిని ధుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Updated Date - 2020-03-12T09:04:15+05:30 IST