ఆలయాల్లో ఆర్జిత సేవల నిలిపివేత

ABN , First Publish Date - 2020-03-21T08:44:30+05:30 IST

రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని దేవాదాయ శాఖ దేవాలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌...

ఆలయాల్లో ఆర్జిత సేవల నిలిపివేత

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ సోమయ్య 

నిజామాబాద్‌ కల్చరల్‌, మార్చి 20: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని దేవాదాయ శాఖ దేవాలయాల్లో ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ సోమయ్య పేర్కొన్నారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో  అర్చకులు, కార్యనిర్వణాధికారులు, ఉద్యోగులతో ఆయన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావంతో దేవాదాయ శాఖ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా పరిఽధిలోని అన్ని ఆలయాల్లో నిత్యం  నిర్వహించే ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు ఆలయాల్లో ఎలాంటి ఆర్జిత సేవలు ఉండవని తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆర్జిత సేవలను ప్రారంభిస్తామని అన్నారు. ఆలయాల్లో ప్రతినిత్యం చేసే పూజలు యథావిధిగా జరుగుతాయని భక్తులకు మాత్రం అనుమతించడం జరగదని అన్నారు. భక్తులు దేవాదాయ శాఖ అందిస్తున్న సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ దేవాలయాల కార్యనిర్వహణాధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-21T08:44:30+05:30 IST