అన్నింటా ఆమే
ABN , First Publish Date - 2020-03-08T06:49:10+05:30 IST
జిల్లాలో అన్నింట్లోను ఆమెనే ముందు. ప్రతిరంగంలో నూ ఆమె లేనిదే నడువదు. జనాభాలోనూ ఆమెనే ప్రథ మం. ఓటర్లలోనూ వారే అత్యధికం. పురుషుల కంటే స్త్రీ లే ఎక్కువగా...

- జిల్లాలో అన్నింట్లో మొదటి స్థానం ఆమెదే..
- కుటుంబాలను తీర్చిదిద్దుతుంది మహిళలే
- జనాభాలో సగానికిపైగా ఉన్నా.. అక్షరాస్యతలో వెనుకడుగే
- రిజర్వేషన్లు కల్పించినా.. పెత్తనం భర్తలదే..
నిజామాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో అన్నింట్లోను ఆమెనే ముందు. ప్రతిరంగంలో నూ ఆమె లేనిదే నడువదు. జనాభాలోనూ ఆమెనే ప్రథ మం. ఓటర్లలోనూ వారే అత్యధికం. పురుషుల కంటే స్త్రీ లే ఎక్కువగా ఉన్నా సమాన అవకాశాలు తక్కువగా ఉ న్నాయి. రిజర్వేషన్ల వల్ల స్థానిక సంస్థలలో సమాన అవ కాశా లు దక్కినా ఇప్పటికి పురుషు లదే పెత్తనంగా ఉం టుంది. జిల్లాలో వ్యవసాయం, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో వారే కీలకంగా ఉన్నారు. వారి కృషితోనే అభివృద్ధి జరు గుతోంది. వ్యవసాయరంగం ముందుకుపోతుంది. కుటుం బాలు ఆర్థికంగా బలోపేతతం అవుతున్నాయి.
ఇన్ని చేస్తున్నా మహిళలకు మాత్రం రాజకీయంతో పాటు ఇతర రంగాలలో మాత్రం తగిన గుర్తింపు రావడం లేదు. జి ల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 15.71 లక్షల మంది జనాభా ఉంది. వీరిలో 51శాతంపైగా మహిళ జనా భానే ఉన్నారు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధి లో మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జనాభాతో పా టు ఓటర్లుగా వారే అదికంగా ఉన్నా అన్ని రంగాలలో మాత్రం వెనుబడే ఉన్నారు. సమాన అవకాశాలను ద క్కించుకోవడం లేదు. పురుషులతో పాటు పనులు చేస్తు న్న ప్రభుత్వ రంగంలో మినహాయిస్తే ప్రైవేట్, వ్యవసా యరంగంలో వారికి వచ్చే జీతాలు, కూలి తక్కువే. పురు షులతో సమానంగా ఇవ్వడం లేదు. రాజ్యాంగంలో అందరు సమానమే అని చెప్పినా పనికి వచ్చే వరకు మహిళలకు సమాన అవకాశాలు వేతనాలు రావడం లే దు. రాజకీయాలలో పదవులు అంత మాత్రంగానే వస్తు న్నాయి. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను అమలు చేయ డం వల్ల మహిళలు ఎక్కువ స్థానాలు దక్కించుకున్నా పనులు మాత్రం వారిని ఉధృతం చేయనివ్వడం లేదు. వారి భర్తలు, కుటుంబ సభ్యులు చేస్తున్నారు.
విద్య : జిల్లాలో మహిళ జనాభనే అధికంగా ఉంది. జనాభాలో అధికంగా ఉన్నా పురుషులతో పోల్చితే అక్షరా స్యత తక్కువగానే ఉంది. జిల్లాలో సగటు అక్షరాస్యత 64శాతం ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత ప్రస్తు తం 74శాతం ఉండగా మహిళల అక్షరాస్యత 54.08 శా తం ఉంది. గడిచిన పదేళ్లలో తల్లి దండ్రులలో, ప్రభు త్వంలో మార్పు రావడం వల్ల కొద్దిగా మహిళల అక్షరా స్యత పెరిగింది. గురుకుల పాఠశాలలు, కళాశాలలు పె రగడం వల్ల మహిళల అక్షరాస్యత శాతం పెరుగుతుంది.
వ్యవసాయం : జిల్లాలో వ్యవసాయ రంగం గణనీ యంగా అభివృద్ధి చెందింది. అంకాపూర్ లాంటి గ్రామా లు ఎన్నో అభివృద్ధి చెందాయంటే వీటికి కారణం మహి ళల పనితీరే. వ్యవసాయ రంగంలో పురుషుల కంటే స్త్రీ లు ఎక్కువగా కష్టపడటం వల్లనే బాగా అభివృద్ధి చెం దింది. జిల్లాలోని రైతులు మూడు పంటలు పండించే స్థాయికి ఎదిగారు. పంట వేసినప్పటి నుంచి కోసే వర కు మహిళల బాగస్వామ్యమే ఎక్కువగా వ్యవసాయం లో ఉంది. రైతులు ఇతర పనులు చేసినా విత్తనం నుం చి కలుపు వరకు, పసుపు తీయడం నుంచి ఎండ బ్టె డం వరకు మహిళలే అధికంగా పనిచేస్తున్నారు. రైతు కుటుంబాలు బాగు పడేందుకు వారే కీలకంగా ఉన్నారు. అయినా రైతులకే ఈ రంగంలో వెంట నిలుస్తుంది.
రాజకీయ రంగం : జిల్లాలో ఓటర్లలో మహిళలే అ ధికంగా ఉన్నా రాజకీయ రంగంలో తగిన అవకాశం రా లేదు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా ఒక్క మ హిళకు కూడా ఈదఫా అవకాశం రాలేదు. ఏ పార్టీ కూ డా సగం సీట్లను మహిళలకు కేటాయించలేదు. స్థానిక సంస్థలలో ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పించడంతో మహి ళలకు తగిన అవకాశాలు వచ్చాయి. ఎంపీటీసీలు, జడ్పీ టీసీలు, సర్పంచ్‌లుగా సగానికి పైగగా వారే ఎన్నికయ్యా రు. గ్రామాలను నడిపిస్తున్నారు. ఎంపీపీలుగా సగం స్థానాలను ఆక్రమించారు. మున్సిపల్ కార్పొరేషన్‌తో పా టు మూడు మున్సిపాలిటీలలో రిజర్వేషన్ల కారణంగా వారే పదవులను అలంకరించారు. మహిళలకు పదవు లు వచ్చిన భర్త లేదా కుటుంబ సభ్యుల పెత్తనమే ఎ క్కువగా కనిపిస్తోంది.
కుటుంబ బాధ్యతల్లో : జిల్లాలో ఎక్కువగా కుటుం బాలు మహిళలపై ఆధారపడి నడుస్తున్నాయి. వారు రౌండ్ ది క్లాక్ పనిచేయడం వల్లనే కుటుంబాలు సక్రమంగా కొనసాగుతున్నా యి. వ్యవసాయ కూలీగా, బీడి కార్మికురాలిగా, రైతుగా, ఉద్యోగి గా, వ్యాపారిగా, వృత్తి నిపుణు లుగా, ఉపాధ్యాయులుగా విభి న్న రంగాలలో వారు తమ ప్ర తిభ చాటుతున్నారు. సంపాది స్తూ కుటుంబాలు పోషిస్తున్నా రు. జిల్లాలో ఎక్కువ మంది మహిళలు బీడీలు చుడుతూ పిల్లలను పెంచి పోషిస్తు న్నారు. కుటుంబాలకు ఆర్థికం గా అండగా నిలుస్తున్నారు. ప్రతి రైతు ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలు పోషిస్తు న్న పాత్ర తక్కువ కాదు. వారు లేని రంగం లేదు. వైద్యం, విద్య, వ్యాపారంతో పాటు అన్ని రంగాలలో విజ యాలు సాధిస్తూ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ఇన్ని చేస్తున్నా మహిళలకు మాత్రం పురుషులతో సమానంగా వేతనాలు మాత్రం రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు మినహాయిస్తే మిగతా అన్నిరంగాలలో పురు షుల కంటే తక్కువగానే ఇస్తున్నారు.
వ్యవసాయ రంగంలోనూ అదే పరిస్థితి ఉంది. పురు షుల కంటే ఎక్కువగా పనులు చేస్తున్న వారికి అన్నిరం గాలలో సమాన వేతనాలు ఇస్తే మరింత ఎదిగే అవకాశం ఉంది.