చెట్టుపై నుంచి మృతదేహాన్ని కిందకు దించిన పోలీసులు
ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST
చెట్టుపై నుంచి మృతదేహాన్ని కిందకు దించిన పోలీసులు

నిజామాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలకు పోలీసులు స్పందించారు. ఎట్టకేలకు చెట్టుపై నుంచి గంగాధర్ మృతదేహాన్నిపోలీసులు కిందకి దించారు. 3 రోజులుగా ఆయన మృతదేహం చెట్టుకు వేలాడుతూనే ఉంది. సిరికొండ పోలీస్‌స్టేషన్‌కు జిల్లా ఉన్నతాధికారులు చేరుకున్నారు. గంగాధర్ కుటుంబ సభ్యులతో అధికారుల చర్చలు జరిపి మృతదేహాన్ని కిందకు దించారు.
జిల్లాలోని న్యాయవందిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడ్రోజులులగా గంగాధర్ అనే వ్యక్తి మృతదేహాం చెట్టుకు వేలాడుతూనే ఉంది. అంతకుముందు మృతదేహాన్ని కదలించడానికి స్థానికులు మాత్రం ఒప్పుకోలేదు. పోలీసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు. ఓ మహిళ హత్య కేసులో గంగాధర్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా మహిళ హత్యకు ఓ టీఆర్ఎస్ నాయకుడే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు.