నూతన ఓటరు కార్డులను తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-02-08T12:00:06+05:30 IST

జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, నిజామా బాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో ఏపీ సీరి స్‌తో మొదలయ్యే 14 డిజిట్‌లు గల పాత

నూతన ఓటరు కార్డులను తీసుకోవాలి

నిజామాబాద్‌ అర్బన్‌:  జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, బాన్సువాడ, నిజామా బాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ  నియోజకవర్గాల్లో ఏపీ సీరి స్‌తో మొదలయ్యే 14 డిజిట్‌లు గల పాత ఓటరు గుర్తింపు కార్డులను 10 డిజిట్‌లు గల కొత్త ఓటరు గుర్తింపు కార్డులుగా మార్చామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్‌ నియో జకవర్గానికి సంబంధించి వైవోజీ సీరిస్‌, బోధన్‌ నియోజకవర్గానికి డబ్లూడ బ్లూటీ సీరిస్‌, బాన్సువాడ నియోజకవ ర్గానికి ఆర్‌ఎన్‌డీ సీరిస్‌, అర్బన్‌ నియో జకవర్గానికి ఐహెచ్‌ఎల్‌ సీరిస్‌, నిజా మాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి యుఎస్‌ఏ సీరిస్‌, బాల్కొండ నియోజ కవర్గానికి టీఎఫ్‌జీ సీరిస్‌తో  మొదల య్యే పది డిజిట్‌లు గల కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జనరేట్‌ చేశామ న్నారు.


ఆర్మూర్‌ నియోజకవర్గానికి 39, 519, బోధన్‌ నియోజకవర్గానికి 47,7 70, బాన్సువాడ నియోజకవర్గానికి 48, 944, నిజామాబాద్‌ అర్బన్‌కు 15,157,  నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవ ర్గానికి 53,115,  బాల్కొండ నియోజక వర్గానికి 51,535 కార్డులను మొత్తం 2,56,040 కొత్త కార్డులు జారీ చేశా మన్నారు. ఏపీ సీరిస్‌తో మొదలయ్యే 14 డిజిట్‌లు గల ఓటరు గుర్తింపు కా ర్డులు కలిగిన ఓటర్లు సమీప మీ సేవ కు వెళ్లి కొత్త గుర్తింపు కార్డులను పొం దాలని కలెక్టర్‌ తెలిపారు. ఏ మీ సేవా సెంటర్‌లోనైనా ఇవీ లభ్యమవుతాయని  తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం ఓటరు కార్డులను అప్‌డేట్‌ చేశామని, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నలతో ఉంటాయని కలెక్టర్‌ చెప్పారు.

Updated Date - 2020-02-08T12:00:06+05:30 IST