అన్నదాత సాగుబాట

ABN , First Publish Date - 2020-06-23T11:08:20+05:30 IST

జిల్లాలో వర్షాలు పడుతుండడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలతో పాటు వరి నాట్లు వేస్తున్నారు.

అన్నదాత సాగుబాట

జిల్లాలో జోరందుకున్న పంటల సాగు 

రుణాల కోసం రైతుల ప్రయత్నాలు

ఇప్పటివరకు రూ.180 కోట్లే పంపిణీ 

రైతుబంధు కోసం కొత్త రైతుల దరఖాస్తు


నిజామాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వర్షాలు పడుతుండడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలతో పాటు వరి నాట్లు వేస్తున్నారు. రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళుతున్నారు. రుణమాఫీ అమలవుతుండడంతో కొత్త రుణాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం రైతుబం ధు నిధులు ఇంకా వేయకపోవడంతో ఎక్కువ మంది పంట రుణాలు తీసుకొనేందుకు వస్తున్నారు. అనుకు న్న లక్ష్యం ప్రకారం మూడు నెలల్లో పంట రుణాలు  ఇ వ్వాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించినా ఇప్పటి వరకు రుణాల పంపిణీ ఊపందుకోలేదు. రైతులు రు ణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే సాగు ప నులను కొనసాగిస్తున్నారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఈ దఫా దరఖాస్తు చేసుకున్నారు. 


సాధారణ వర్షపాతం నమోదు..

జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం లాగానే ఈ దఫా కూడా జూన్‌ మొదటి వారం నుంచే వర్షాలు పడుతున్నాయి. జిల్లా లో ఇప్పటి వరకు 126.1 మి.మీ.ల వర్షం పడాల్సి ఉం డగా.. 144.9 మి.మీ.ల వర్షం పడింది. జిల్లాలోని బా ల్కొండ, ధర్పల్లి, ముప్కాల్‌, భీమ్‌గల్‌ మండలాలు మినహా మిగిలిన 29 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు విత్తనం వేసేందుకు అనుకూలం గా పడుతుండడంతో రైతులు కూడా సాగు పనుల్లో ని మగ్నమయ్యారు. జూన్‌ మొదటి వా రం నుంచే విత్తనాలు వేస్తున్నారు. పసుపు, సోయా, మొ క్కజొన్న, కందులు, పెసర్లు, పత్తి వేస్తున్నారు. వీటితో పాటు వరినా ట్లు కూడా మొదలుపెట్టారు. 


70 వేల ఎకరాల్లో మొదలైన సాగు..

జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 70 వేల ఎకరాల్లో పంటలను వేశారు. జిల్లాలో అత్యధికంగా వరి సాగు కానుండడంతో ఎక్కువ మంది రైతులు వరి నారుమడులను సిద్ధం చేశారు. ప్రభుత్వ సూచించిన విధంగానే లాభసాటి పంటలను వేసేందుకు సిద్ధమవుతున్నారు. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో కురుస్తుండడంతో జిల్లాలో ఈ దఫా ఎక్కువ మొత్తంలో సాగు చేసేందు కు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎ రువులను సిద్ధం చేసుకొని పంటలు వేస్తున్నారు. కూ లీలు అందుబాటులో లేకున్నా ఎక్కువ మొత్తంలో చెల్లి స్తూ సాగును కొనసాగిస్తున్నారు. 


పంట రుణాల కోసం రైతుల ప్రయత్నాలు..

ఈ దఫా సాగుకు ముందు రైతుబంధు విడుదల కా కపోవడంతో ఎక్కువ మంది రైతులు పంట రుణాల కో సం చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చే స్తున్నారు. ప్రభుత్వం రూ.25 వేలలోపు ఉన్న రుణాల ను మాఫీ చేయడంతో ఆ రైతులు కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 


వానాకాలం రుణలక్ష్యం రూ.2,034.19 కోట్లు

జిల్లాలో ఈ వానాకాలంలో రూ.2034.19 కోట్ల రుణాలు రైతులకు అందించాలని నిర్ణయించారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు టార్గెట్‌లను ఇచ్చారు. ఆ టార్గెట్‌లకు అనుగుణంగా జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో రుణాలను పూర్తిచేయాలని బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసు కున్నారు. ఏ రైతుకు ఇబ్బంది కలగకుడా పంట రు ణాలను అందించాలని బ్యాంకు అఽధికారులను కోరారు. కానీ, వానాకాలం సాగు మొదలై 22 రోజులు దాటినా ఇప్ప టి వరకు రుణ పంపిణీ ఊపం దుకోలేదు. జిల్లా వ్యాప్తంగా కేవ లం రూ.180 కోట్లు మాత్రమే రైతులకు రుణాలుగా ఇచ్చారు. చాలా బ్యాంకుల్లో పాత రుణాల ను రీ షెడ్యూల్‌ చేస్తున్నారు.


వడ్డీ చెల్లించిన రైతులకు  స్కేల్‌ ఆఫ్‌ ఫై నాన్స్‌ ప్రకారం రుణాలను మంజూరు చేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో రుణాలు చె ల్లించిన రైతులకు కొత్త రుణాలను అందిస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన వల్ల భూమి పట్టా బుక్కులు కొత్తవి రావడంతో వాటి ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేస్తున్నారు. ప్రతీ రైతు నుంచి పట్టాదారు పాస్‌బుక్‌ జి రాక్స్‌ కాపీ, ఆధార్‌కార్డు, ఫొటోలను తీసుకుంటూ రుణాలను మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వం రుణాల మా ఫీ చేస్తుండడంతో ఎక్కువ బ్యాంకులు మాఫీ అయిన వాటిని పరిశీలించిన తర్వాతనే రైతులకు రుణాలను అందిస్తున్నారు. బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా త్వరగా రుణాలు ఇవ్వాల్సి ఉన్న బ్యాంకు అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. రుణాల కోసం వచ్చే రైతులకు ముందుగా రీ షెడ్యూల్‌ చేసుకొమ్మని కోరుతున్నారు. ఆ తర్వాత కొత్త రు ణాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు రుణాలు తీసుకొ ని రైతులకు మాత్రం కొత్తగా రుణాలను అందిస్తున్నా రు.


జిల్లా లో నిర్ణయించిన లక్ష్యం ప్రకారం జూన్‌ నెల లో రూ.600 కోట్ల వరకు రైతులకు రుణాలుగా అందిం చాలి. ప్రస్తుతం అంత మొత్తంలో ఇవ్వలేదు. ఇప్పటి వరకు కేవలం రూ.180 కోట్లే అందించారు. ఈనెలలో ఇంకా కేవలం 8 రోజులు మాత్రమే సమయం ఉంది. రైతులకు త్వరగా రుణ పంపిణీ జరిగితే అవసరాల కో సం ప్రైవేట్‌ అప్పులు తీసుకునే పరిస్థితి తప్పనుంది. జి ల్లా వ్యవసాయ, లీడ్‌ బ్యాంకు అధికారులు దృష్టి పెడితే త్వరగా రైతులకు రుణాలు అందే అవకాశం ఉంది. 


రైతుబంధుకు భారీగా కొత్త దరఖాస్తులు 

జిల్లాలో ఈ దఫా రైతుబంధుకు ఎక్కువ మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి పెట్టుబడి డబ్బులు అందే అవకాశ ం ఉండడంతో గతంలో రైతుబంఽ దు రాని రైతులు ఈ దఫా దరఖా స్తు చేసుకున్నారు. వారికి గత రెం డు సంవత్సరాలు పట్టాదారు పాస్‌పుస్తకాలు రాకపోవడం వల్ల రైతుబంధు రాలేదు. వార ందరికీ ప్రభుత్వం కొత్తగా అవకాశం ఇవ్వడంతో జిల్లా లో 17,994 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో కలిపి మొత్తం 2,48,865 మంది రైతులు రైతుబంధు అర్హులున్నారని అధికారు లు తెలిపారు. ప్రభుత్వ నిబంధన ల ప్రకారం మొదట సన్న, చిన్నకారు రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున బ్యాంకుల్లో జమచేయనున్నారు. మిగతా వారికి ఆ త ర్వాత విడతల వారీగా వేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు రైతుబంధురాని రైతుల వివరాలను ఆ న్‌లైన్‌లో నమోదు చేశామని ఇన్‌చార్జి జేడీఏ వాజిద్‌ హుస్సేన్‌ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతు బంధు విడుదలవుతుందని ఆయన తెలిపారు.


మూడు నెలల్లో రుణలక్ష్యాన్ని పూర్తిచేస్తాం..జయసంతోషి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ 

జిల్లాలో నిర్ణయించిన లక్ష్యం ప్రకారం రుణాలు అం దించేందుకు ఏర్పాట్లు చేశాం. మూడు నెలల్లో అనుకు న్న లక్ష్యానికి అనుగుణంగా రైతులందరికీ రుణాలు అంది స్తాం. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారమే రైతులకు ఈ రుణాలను ఇస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-06-23T11:08:20+05:30 IST