సర్కార్‌ భూములపై నజర్‌

ABN , First Publish Date - 2020-07-10T11:18:59+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం సర్కారు భూములపై దృష్టిపెట్టింది. కబ్జా అయిన భూముల వివరాలు వెలికి తీస్తోం ది

సర్కార్‌ భూములపై నజర్‌

జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ  భూములపై దృష్టి సారించిన అధికారులు

శాఖల వారీగా పహానీలు సిద్ధం చేస్తున్న తహసీల్దార్లు

ఆయా శాఖల కార్యాలయాల పేరు మీదే పహానీలు తయారు చేస్తున్న అధికారులు

నగరం పరిధిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు

ఇకపై సర్కారు భూములు కబ్జా కాకుండా పకడ్బందీగా  చర్యలు


(నిజామాబాద్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం సర్కారు భూములపై దృష్టిపెట్టింది. కబ్జా అయిన భూముల వివరాలు వెలికి తీస్తోంది. భూములను స్వాధీనం చే సుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. కొన్ని చోట్ల ఇప్పటికే కబ్జా అయిన భూముల ను స్వాధీనం చేసుకోగా మరికొన్ని చోట్ల వివరాలు సేకరిస్తోంది. ఆయా మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను పక్కాగా చేసి భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శాఖల వారీగా భూమి ప హానీలను తయారుచేసి ఆయా శాఖల పేరు మీద ప ట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తన్నారు. నిజామాబా ద్‌ నగర శివారులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పా టు కోసం పెద్దఎత్తున భూములను గుర్తించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. ఆ భూములలో త్వరలో ఫుడ్‌ ప్రా సెసింగ్‌ పార్కులను ఏర్పాటు చేసేందుకు చర్యలు  చేపడుతున్నారు. 


సర్కారు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల భూములు పక్కాగా అవుతున్నాయి. గతంలో కబ్జా అ యిన భూములను కూడా ఆయా శాఖల అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ భూముల పరిధిలో ట్రెంచ్‌లు కొడుతున్నారు. నిజామాబాద్‌ నగరం శివారులోని రూరల్‌ మండలం పరిధిలో చెరువు శిఖం భూములు గతంలో కబ్జా కాగా సారంగాపూర్‌ పరిధిలో  వారం క్రితం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూముల  చుట్టూ ట్రెంచ్‌లను కొట్టారు. నగరం పరిధిలోని ఎడపల్లి, మాక్లూర్‌, డిచ్‌పల్లి, నవీపేట మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణ యం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఆ భూముల పహనీలను శాఖల వారీగా రెడీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ప్రఽభుత్వ కార్యాలయాల భూములను వాటిపేరు మీదే పహనీలను సి ద్ధం చేస్తున్నారు. కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. 


అన్యాక్రాంతమవుతున్న భూములు

నిజామాబాద్‌ నగరం చుట్టూ విలువైన ప్రభుత్వ భూములు చాలా ఏళ్ల నుంచి అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటిలో కొన్నింటిని ప్రభుత్వమే ఇళ్ల  స్థలాలకు ఇవ్వగా మరికొన్నింటిని కొంత మంది కబ్జా చేసి ఇళ్ల స్థ లాలకు అమ్మకాలు చేశారు. కొన్నింటిలో ఇళ్లను నిర్మించుకోగా మరికొన్ని భూములు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి అప్పటి రాజకీయ నాయకుల ప్రోద్భలంతో భూములు ఆక్రమించుకున్నారు. కొన్నింటిలో ఇళ్లు నిర్మిచుకోగా అవి ఇప్పటికే రెగ్యులర్‌ అయ్యాయి. మిగతా భూముల్లో మాత్రం ఖాళీగా ఉండడంతో అవి తహసీల్దార్‌లు స్వాధీనం చేసుకుంటున్నారు. చాలా మండలా ల పరిధిలో ప్రభుత్వ భూములు తక్కువవగా ఉన్నాయి. అభివృద్ధి పనులకు వినియోగించుకునేందుకు భూములు అందుబాటులో లేవు.


ప్రస్తుతం ఈ పహనీలను సిద్ధం చేస్తుండడం వల్ల భూముల వివరాలన్ని పక్కా అవుతున్నాయి. ఈ భూముల ఆధారంగా భవిష్యత్తులో అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోం ది. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నం దున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కును ఏర్పాటు చేస్తే రైతుల కు ఉపయోగపడుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ఆదే శాల మేరకు జిల్లా యంత్రాంగం నగరం సమీపంలో భూముల వివరాలను సేకరిస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు 200 ఎకరాల వరకు అ వసరం కావడంతో సారంగాపూర్‌, గుండారం ప్రాంతా ల్లో ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నారు. గుండారం ప్రాంతాల్లో 150 ఎకరాల వరకు ఒకే దగ్గర భూములు ఉన్నట్లు గుర్తించారు. సారంగాపూర్‌లో కూడా కొన్ని చో ట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి.


వీటితోపాటు కో ఆపరేటివ్‌ చక్కెర ఫ్యాక్టరీ భూములు కూడా ఉన్నాయి. ఫు డ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు ఏర్పాటు చేస్తే జిల్ల రైతులకు మేలు జరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఆదేశాల కు అనుగుణంగా ఈ భూముల  వివరాలను సేకరిస్తున్నారు. నగరం పరిధిలోని ఇతర మండలాల్లో కూడా భూములను పరిశీలిస్తున్నారుర. అన్యాక్రాంతమైన భూములను తిరిగి తీసుకోవడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు, ఇతరఅవసరాలకు వినియోగిచేందుకు ఏర్పాట్లను చేస్తున్నా రు. ప్రభుత్వ ఉత్తర్వులు, కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆ దేశాలకు అనుగుణంగా భూముల పహనీలన్నీ సిద్ధం చేస్తున్నామని పలు మండలాల తహసీల్దార్‌లు తెలిపారు. ఆయా కార్యాలయాల పేరు మీదే పహనీలు సిద్ధం చే స్తున్నామన్నారు. అన్యా క్రాంతమైన భూములను కూడా గుర్తించి స్వాధీనం చేసుకొని ట్రెంచ్‌లు కొడుతున్నామని తెలిపారు.  ఆయా శాఖల భూములకు  చాలా ఏళ్ల తర్వాత పహనీలు సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల భవిష్యత్తులో అన్యాక్రాంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 

Updated Date - 2020-07-10T11:18:59+05:30 IST