ఉపాధిహామీపై నజర్‌

ABN , First Publish Date - 2020-12-19T05:49:51+05:30 IST

ఉమ్మడి జిల్లాకు కేంద్ర బృందం త్వరలో రానుంది. ఉపాధి హామీపైన గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు ఇతర అంశాలను చర్చిస్తారు.

ఉపాధిహామీపై నజర్‌

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేయనున్న కేంద్ర బృందం
పనులు, కూలి చెల్లింపులను పరిశీలించనున్న అధికారులు
ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

నిజామాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఉమ్మడి జిల్లాకు కేంద్ర బృందం త్వరలో రానుంది. ఉపాధి హామీపైన గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. పనుల నాణ్యతను పరిశీలించడంతో పాటు ఇతర అంశాలను చర్చిస్తారు. గ్రామాల్లో తిరుగుతూ ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధులను రికార్డుల ఆధారంగా చూస్తారు. గ్రామసభను నిర్వహించి గ్రామస్థులను అడిగి తెలుసుకుంటారు. ఏవైనా అవకతవకలు జరిగితే చర్యలకు ఉపక్రమిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ సెక్రెటరీ ఆధారంగా ఈ బృందం వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. దేశవ్యాప్తంగా ఉపాధిహామీ పథకం అమలవుతోంది. యుపీ ఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని మొదలుపెట్టారు.  దేశవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో  ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. గ్రామా ల పరిధిలో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు రోడ్లు, కాల్వలు, వ్యవసాయ భూముల అభివృద్ధి పనులను ఈ నిధుల కింద  చేస్తున్నా రు. వీటితో పాటు చెరువులను పునరుద్ధరించడంతో పాటు అడిగిన వారందరికీ ఉపాధిని కల్పిస్తున్నారు. గ్రామాల్లో పనులు లేని సమయం లో అడిగిన వారికి ఇవ్వడంతో పాటు వారు చేసిన పని ఆధారంగా కూలిని చెల్లిస్తున్నారు. గరిష్టంగా  ప్రతీరోజు 237 రూపాయలకు తగ్గకుండా ఈ చెల్లింపులను  చేస్తున్నారు. కూలీల ఖాతాల్లోనే డబ్బులను జమ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పనులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 2,49,872 కుటుంబాలకు కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 5,10,527 మందికి ఉపాధి కల్పించారు. కామారెడ్డి జిల్లాలో 2,12,628 కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 5,03,073 మందికి  పనులు కల్పించారు. అడిగిన వారికి కొత్త కార్డులు ఇవ్వడంతో పాటు ఆయా గ్రామాల పరిధిలో ఈ పనులను కల్పిస్తున్నారు. కరోనా ఉన్నా పనులు కల్పిస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఉపాధి పనులను కొనసాగించారు. పనులు దొరకకుండా, ఇబ్బందులు  తలెత్తకుండా ఉండేం దుకు ఈ పనులను చేశారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలో పనులు ఎక్కువ గా జరగడంతో పాటు కూలీలకు ఎక్కువ సంఖ్యలో పనులను కల్పించారు.  రెండు జిల్లాల పరిధిలో కోట్ల రూపాయలను ఈ పనుల కోసం వినియోగించారు. ఉపాధిని కూలీలకు కల్పించారు. వీరు చేసిన పనుల ఆధారంగా మెటీరియల్‌ కాంపౌండ్‌ కూడా నిధులను కేటాయించారు. గ్రామాల్లో ప్రధానంగా కాల్వల్లో చెట్లను తొలగించడం, కందకాలు తీయడం, వ్యవసాయ భూముల ఒడ్లను సరిచేయడం, చెరువుల్లో పూడిక తీయడం, అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, హరితాహారం మొక్కలను పెట్ట డం, సంరక్షించడం కోసం నిధులను కేటాయించారు. ఈ పనుల్లో  కూలీలకు ఉపాధి కల్పించారు. ఇవే కాకుండా గ్రామాల్లో కొత్తగా పల్లెప్రకృతి వనాల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవనాలు, స్త్రీశక్తి భవనాలు, కొన్ని ప్రాం తాల్లో రోడ్ల నిర్మా ణం చేపట్టారు.  వీటితో పాటు పలు పనులకు ఈ నిధులను వినియోగించా రు. రాష్ట్రస్థాయిలోనే గడిచిన కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో ఈ నిధులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతీయేడు కూలీలకు ఎక్కువగా పనులను కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలకు వస్తున్న కేంద్ర బృందం ఇప్పటికే ఒక దఫా రంగారెడ్డి జిల్లాలో తనిఖీలను గత నెలలోనే పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాతో  పాటు నల్గొండ జిల్లాలో పర్యటించనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న జాయింట్‌ సెక్రెటరీ ఆధ్వర్యంలో వస్తున్న ఈ బృందం ఉమ్మడి జిల్లా పరిధిలో జరిగిన పనులు పరిశీలిస్తారు. ఉపాధి హామీ అన్ని గ్రామాల్లో చేయడం వల్ల కొన్ని గ్రామాలను ఎంపిక చేస్తారు. ఆ గ్రామాలకు వెళ్లి ఉపాధి నిధులు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మంది కూలీలకు ఉపాధి కల్పించారు, ఎంత  మొత్తం చెల్లించారు, సరాసరి ఎన్ని కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు. చేసిన పనులకు బుక్‌ రికార్డులను  సరిగా ఎంట్రీ చేశారా వంటి అంశాలను తనిఖీ చేస్తారు. చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలిస్తారు. వారు పర్యటించిన గ్రామాల నివేదికను కేంద్రానికి అంది స్తారు. పనులు పరిశీలించేందుకు బృందంంలో అన్ని రంగాల కు చెందిన వారు ఉండడంతో ఉమ్మడి జిల్లా అధికారులు కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పను లు  పూర్తి చేయడంతో పాటు ఇతర అన్ని అంశాలను పూర్తిచేసి సిద్ధం గా ఉండే  విధంగా ఈ ఏర్పాట్ల ను చేస్తున్నారు. కేంద్ర బృందం అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు వాటికి సంబంధించిన రికార్డులను చూడనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సోమ లేదా మంగళవారం పర్యటించే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఈ ఏర్పాట్లను చేస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా పనులు ఉపాధి ద్వారానే ఎక్కువగా జరుగుతుండడంతో కేంద్ర అధికారులు ఈ పర్యటనకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్‌లు ఇప్పటికే  గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించారు. అన్ని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండా లని ఉపాధి హామీ సిబ్బందిని కోరారు. రికార్డులను సిద్ధం చేయడంతో పాటు గ్రామాల్లో నోటీసు బోర్డులు ఉండే విధంగా ఏర్పాట్లను చేస్తన్నారు. కేంద్ర బృందం తనిఖీకి వచ్చి వెళితే  పనుల నాణ్యత బాగా ఉంటే వచ్చే రోజుల్లో మరిన్ని నిధులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. రికార్డులన్నీ పక్కాగా ఉండే విధంగా ఈ పనులు చేస్తున్నారు. బృందం వచ్చి వెళ్లిన తర్వాత సమీక్షించి మరిన్ని పనులు చేపట్టనున్నారు.

రికార్డులు పక్కాగా ఉండాలి
కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి
గ్రామాల్లో ఉపాధి హామీ కింద నిర్వహించే పనులు నాణ్యతగా ఉండాలి. అదేవిధంగా రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలి. సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా శుక్రవారం డీఆర్‌డీఏ, ఎంపీడీవోలతో సమీక్షించాను. జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్‌ జిల్లాలో పర్యటించి వెళ్లారు. ఆయన సూచనలకు అనుగుణంగా రికార్డులను పూర్తి చేయాలి. పనులు జరిగిన చోట బోర్డులను ఏర్పాటు చేయాలి.  ప్రతీ పనికి సంబంధించిన వివరాలు వర్క్‌ ఫైల్‌లో ఉంచడంతో పాటు గ్రామ పంచాయతీ తీర్మాణం, మాస్టర్‌ రోల్స్‌ ఫొటోలు, అధికారుల సంతకాలు, కూలీల చెల్లింపుల వివరాలు పద్ధతి ప్రకారం నమోదు చేయాలి. ఎవరైనా చేయకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అన్ని పక్కాగా చూసుకోవాలి. ప్రతీరోజు పనుల కోసం వ చ్చే కూలీల సంఖ్య పెరిగే విధంగా చూడాలి. అన్ని గ్రామాల పరిధిలో రికార్డులన్ని సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

Updated Date - 2020-12-19T05:49:51+05:30 IST