నయనానందకరం.. వైకుంఠ ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-26T05:24:50+05:30 IST

జిల్లా అం తటా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు శుక్రవా రం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవైష్ణ వాలయాల్లో స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు.

నయనానందకరం.. వైకుంఠ ఏకాదశి
సుభాష్‌నగర్‌లో స్వామివారి ఊరేగింపు

ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్న భక్తజనం 

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు 

నిజామాబాద్‌  కల్చరల్‌, డిసెంబరు 25: జిల్లా అం తటా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు శుక్రవా రం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవైష్ణ వాలయాల్లో స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం బారులు తీ రారు. లక్ష్మీనారాయణుడు వివిధ ఆలయాల్లో దేవతామూర్తిగా ఆర్చావతారంలో గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి బయలుదేరి పురవీధుల గుండా భక్తులకు దర్శన భాగ్యాన్ని అందించారు. స్వామి ఊరేగింపు భక్తుల భజనలు, కోలాటాలతో సాగింది. ఉదయం నుంచి ప్రారంభమైన దర్శనాలు రాత్రి వరకు సాగా యి. పలు ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పారాయణాలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన గీతాజయంతి  కావడంతో శ్రీకృష్ణ ఆలయాల్లో గీ తా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకొని దర్శించుకున్నారు. జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైన జెండా బా లాజీ మందిరం, సుభాష్‌నగర్‌ రామాలయం, ఆర్యనగర్‌ వేంకటేశ్వర స్వామి ఆలయం, భీమ్‌గల్‌ లక్ష్మీ న ర్సింహస్వామి ఆలయం, చక్రంగుడి, శ్రీకృష్ణ గీతామందిరం, ఖిల్లా రఘునాథ ఆలయం, హమాల్‌వాడీ సా యి సంతోషి ఆలయం, డిచ్‌పల్లి రామాలయం, నగరంలోని అయోధ్య రామాలయం, పోచంపాడ్‌ రామాలయం, బోధన్‌ వేంకటేశ్వర స్వామి ఆలయం, మో ర్తాడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయం, అయ్యప్ప దేవాలయంలోని లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం,  మో స్రా రామాలయం, హయగ్రీవ స్వామి ఆలయం, అపు రూప వేంకటేశ్వర స్వామి ఆలయం, ఉత్తర తిరుపతి క్షేత్రం, శక్కర్‌నగర్‌ రామాలయం, తొర్లికొండ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఆర్మూర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయం, రామాలయం, మామిడిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం, డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ వేంకటేశ్వర స్వామి ఆలయం, తదతర దేవాలయాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు జరిగాయి. నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ వేడుకల్లో సినీ నిర్మాత దిల్‌రాజు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. జెండా బాలాజీని ఎమ్మెల్సీ  ఆకుల లలి త దర్శించుకున్నారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. డిచ్‌పల్లి మం డలంలోని ధర్మారం వేంకటేశ్వర ఆలయంతో పాటు ఏడో పోలీసు బెటాలియన్‌ వేంకటేశ్వర ఆలయం, ఖిల్లా డిచ్‌పల్లి రామాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్త ర ద్వార దర్శనాలను ఏర్పాటు చేశారు. సిరికొండలో లక్ష్మీనారాయణునికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశా రు. శ్రీశేష సాయి మహావిష్ణు మందిరంలో భక్తులు దర్శించుకున్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో  తిరుమల తిరుపతి దేవస్థానం, హిం దూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. నవీపేటలోని ఏంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆల యానికి పోటెత్తారు. ఎడపల్లి మండలం జానకంపేట శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయంతోపాటు జైతాపూర్‌, ఏఆర్పీక్యాంప్‌, పోచారం గ్రామాల్లోని రామాలయం అలాగే సారంగాపూర్‌, ఎస్సీఎస్‌ఎఫ్‌ రామాలయంలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. బోధన్‌లో పట్టణంలోని వేంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా కొనసాగాయి. భక్తులకు ఉత్తర ద్వారం ద్వా రా దర్శనాలు చేసుకున్నారు. భీమ్‌గల్‌ పట్టణంలోని లక్ష్మీనర్సింహస్వామిని, బోయిగల్లీలోని లక్ష్మీ వేంకటే శ్వ రస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలకం రిం చారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. జ క్రాన్‌పల్లి, మండలం అన్ని గ్రామాల్లో శుక్రవారం వై కుంఠ ఏకాదశి ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనం గా జరుపుకున్నారు. జక్రాన్‌పల్లి, తొర్లికొండ, అర్గుల్‌, పడకల్‌, కలిగోట్‌, బ్రాహ్మణ్‌పల్లి, నారాయణపేట్‌, ల క్ష్మాపూర్‌, మునిపల్లి గ్రామాల్లో ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముప్కాల్‌ మండలం వెం చిర్యాల్‌, వేంపల్లి, నల్లూర్‌ గ్రామాల్లో వేంకటేశ్వర స్వా మి ఆలయాలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సంద ర్భంగా ఉదయం నుంచి భక్తులు బారులు తీరి దైవ దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆయా గ్రామాల ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. 

Updated Date - 2020-12-26T05:24:50+05:30 IST