వీసీ ద్వారా జాతీయ యూత్ పార్లమెంట్
ABN , First Publish Date - 2020-12-31T04:49:42+05:30 IST
నెహ్రూ యువ కేంద్రం ద్వారా ప్రతీ సంవత్సరం నిర్వహించే జాతీయ యూత్ పార్లమెంట్‌ను ఈ సంవత్సరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.

నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 30: నెహ్రూ యువ కేంద్రం ద్వారా ప్రతీ సంవత్సరం నిర్వహించే జాతీయ యూత్ పార్లమెంట్‌ను ఈ సంవత్సరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. 16 జిల్లాలు, నిజామాబాద్ నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో 14 జిల్లాల నుంచి ఎంపిక చేసి న 64 మంది పాల్గొన్నారు. జూమ్ యాప్ ద్వారా పోటీలు నిర్వహించగా వివిధ అంశాల ఆధారంగా విజేతలను న్యాయనిర్ణేతలు ఎంపిక చేసినట్లు ఎన్‌వైకే కోఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో విజేతలుగా మొదటి స్థానంలో దీపక్, రెండో స్థానంలో శ్రీనిధి, ఆదిలాబాద్ నుంచి శృతి, ప్రతీక్, కామారెడ్డి నుంచి సుల్తానా, అవినాశ్, వరంగల్ నుం చి ప్రణీత, సమ్రిన్ బేగం, వరంగల్ రూరల్ నుంచి అక్షిత, ఆకాంక్ష, జనగామ నుంచి అభిషేక్, రవిబాబు, సిద్దిపేట నుంచి వినీత్, సాయి కళ్యాణ్, సంగారెడ్డి జిల్లా నుంచి విజేతలుగా రాకేష్, భార్గవి నిలిచారన్నారు. న్యాయనిర్ణేతలుగా టీయూ ప్రొఫెసర్ ఆంజనేయులు, తెలుగు టీచర్ కాసర్ల నరేష్, రచయిత కళా గోపాల్, రిటైర్ట్ ఎంపీడీవో ఆంజనేయులు, ప్రధానమంత్రి కౌషల్ కేంద్ర ప్రిన్సిపల్ వాసుదేవారెడ్డి, ఎన్‌వైకే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ వ్యవహరించినట్లు ఆమె తెలిపారు.