ఆన్‌లైన్ తరగతులను పర్యవేక్షించాలి
ABN , First Publish Date - 2020-12-02T04:38:00+05:30 IST
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులను పకడ్బందీగా పర్యవేక్షించాలని నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న
నిజామాబాద్ అర్బన్, డిసెంబరు 1: కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులను పకడ్బందీగా పర్యవేక్షించాలని నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్న ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. మంగళవారం డీఐఈవో కార్యాలయంలో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకులు జూమ్ యాప్ ద్వారా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ వంద శాతం విద్యార్థులు తరగతులు వినేలా చూడాలన్నారు. 50 శాతం అధ్యాపకులు కళాశాల ను ంచి మిగిలిన 50 శాతం అధ్యాపకులు ఇంటి నుంచి ప్రతీరోజు జూమ్ యాప్ ద్వారా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. టీ-షాట్, యాదగిరి ఛానెల్ ద్వారా ప్రసారం అవుతున్న ఆన్‌లైన్ తరగతుల విషయంలో విద్యార్థులు చూసే విధంగా చూడాలన్నారు. జూమ్ యాప్ ద్వారా నిర్వహించే ఆన్‌లైన్ తరగతులను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, ప్రతి విద్యార్థి వినే లా చూడాలన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన తరగతులు ఏ విధంగా విద్యార్థులకు అర్థమయ్యాయో సమీక్ష చేసుకోవాలన్నారు. ఇంటర్ అడ్మిషన్‌లకు సంబ ంధించిన ఫొటోలు, సంతకాలు ఆన్‌లైన్ ద్వారా పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు చిరంజీవి, చంద్ర విఠల్ తదితరులు పాల్గొన్నారు.