నగల కోసం వృద్ధురాలి హత్య

ABN , First Publish Date - 2020-12-25T05:30:00+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో దారుణం జరిగింది. రెండు తులాల బంగారం కోసం భిక్షాటన చేసే ఒక వృద్ధురాలిని హత్య చే శారు.

నగల కోసం వృద్ధురాలి హత్య
ఎల్లవ్వ మృతదేహం

 నిజామాబాద్‌ నగరంలో దారుణం

కిరాయి ఇంట్లోనే మృతదేహాన్ని   పాతిపెట్టిన వైనం

సెల్‌ ఫోన్‌ కాల్‌ ఆధారంగా కేసును ఛేదించిన   పోలీసులు

నిజామాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో దారుణం జరిగింది. రెండు తులాల బంగారం కోసం భిక్షాటన చేసే ఒక వృద్ధురాలిని హత్య చే శారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు కిరాయికి ఉన్న ఇంట్లోనే పాతిపెట్టారు. డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకా రం.. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన వృద్ధురాలు ఎల్ల వ్వ (70) నిత్యం నిజామాబాద్‌కు వచ్చి భిక్షాటన చేసి తిరిగి స్వగ్రా మానికి వెళ్లేంది. ఎప్పటి లాగే ఈ నెల 11న నిజామాబాద్‌కు వచ్చి న ఎల్లవ్వ ఆ రోజు ఫోన్‌ చేసి తాను రాత్రికి ఇంటికి రానని, ఉద యం వస్తానని ఫోన్‌ చేసి చెప్పింది. కానీ ఉదయం కూడా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు నిజామా బాద్‌లో గాలించారు. ఆమె ఎక్కడా దొరకక పోవడంతో ఇందల్వా యి పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చివరి సారిగా ఆమె మాట్లాడిన ఫోన్‌ నెంబర్‌ ఆఽ దారంగా దర్యాప్తు చేపట్టారు. ఆ ఫోన్‌ గల వ్యక్తిని పట్టుకొని విచా రించగా అసలు విషయాలు వెల్లడించారు. నగరంలోని కోటగల్లీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు నర్సవ్వ, ఎల్లయ్యకు వృద్ధురాలైన ఎల్లవ్వతో ఇది వరకే పరిచయం ఉంది. 11వ తేదీన వారు కలవడంతో వృద్ధురాలిని మాటల్లో పెట్టారు. ఆమె వద్ద ఉన్న రెండు తులాల బంగారాన్ని ఎలాగైనా కాజేయాలని పథకం పన్నారు. దీం తో ఇంటికి రావాలని, ఈ రోజు తమ ఇంట్లోనే ఉండాలని వృద్ధు రాలికి మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన ఎల్లవ్వ కోటగల్లీలోని వారి ఇంటికి వెళ్లింది. కాగా కోటగల్లీలో నిందితులు నివాసం ఉంటున్న ఇంటిని వారి కుమార్తె ఇటీవల అద్దెకు తీసుకుం ది. కానీ ఆమె భర్త దుబాయి నుంచి వచ్చేంత వరకు తల్లిదం డ్రులను కిరాయి ఇంట్లో ఉంచింది. అదే కిరాయి ఇంటికి వృద్ధురా లిని నిందితులు తీసుకెళ్లారు. అర్ధరాత్రి వేళ వృద్ధురాలికి ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అద్దె ఇంట్లోనే మూడు ఫీట్ల గుంత తీసి మృతదేహాన్ని పూడ్చి వేశారు. బంగారం కోసమే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకోవడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఇంద ల్వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-12-25T05:30:00+05:30 IST