డబ్బుల కోసమే హత్య

ABN , First Publish Date - 2020-03-12T11:33:29+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ని ఆర్యనగర్‌లో ఈనెల 9వ తేదీన జరిగిన వివాహిత హత్య కేసులో ఇద్దరు నిందితులను

డబ్బుల కోసమే హత్య

వివాహిత హత్య కేసులో నిందితుల అరెస్ట్‌

24గంటల్లో ఛేదించిన పోలీసులు

కేసు వివరాలను వెల్లడించిన సీపీ


ఖిల్లా, మార్చి 11: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ని ఆర్యనగర్‌లో ఈనెల 9వ తేదీన జరిగిన వివాహిత హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు కమిషనర్‌ కార్తికేయ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు చెప్పారు. బుధవా రం సాయంత్రం నిజామాబాద్‌లోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని సీపీ ఏర్పాటు వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముంబాజీపేట్‌ గ్రామానికి చెం దిన పసులాడి నాగరాజు.. నిజామాబాద్‌లోని ఆర్యనగ ర్‌కు చెందిన బిల్డర్‌ శ్రీనివాస్‌ వద్ద ఎనిమిదేళ్లుగా మేస్త్రీ గా పని చేస్తున్నాడు. శ్రీనివాస్‌ ఇతనికి కూలీ డబ్బు లు సకాలంలో ఇవ్వకపోవడంతో.. అప్పుల పాలయ్యా డు. దీంతో కక్ష పెంచుకున్న పసులాడి నాగరాజు.. బి ల్డర్‌ శ్రీనివాస్‌ వాహన డ్రైవర్‌గా పని చేస్తున్న ధుమాలే నాగేష్‌కుమార్‌ అలియాస్‌ నాగరాజు(రాజు)తో కలి సి ఎలాగైనా ఇంట్లో దోపిడీ చేయాలని నిర్ణయించారు. పథకం ప్రకారం సోమవారం హోలీ పండుగ రోజున ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాస్‌ భార్య రాజవరపు ల క్ష్మిపై అదును చూసి దాడి చేశారు.


ముందుగా ఒక రాడ్‌తో ఆమె తలపై బలంగా కొట్టి.. ఆ తర్వాత కత్తితో  గొంతు, చేతుల నరాలను కోశాడు. ఆమె చనిపోయిందని భావించి పోలీసులకు అనుమానం రాకుండా ఉం డేందుకు ముందుగానే కొనుగోలు చేసి వారితో తీసుకొచ్చిన కారం, పసుపును ఆమెపై పూశాడు. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని రెండు వైపుల దీపాలు పెట్టి ఇద్దరూ బయటకు వెళ్లి పోయారు. ఆ తర్వాత ఇన్‌చా ర్జీ ఏసీపీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి.. పసులాడి నాగరాజు,  ధు మాలే నాగేష్‌కుమార్‌ అలియాస్‌ నాగరాజులను దోషు లుగా తేల్చారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీపీ కార్తికేయ తెలిపారు. నిందితులు వినియోగించిన ఆయుధాలను, ఎత్తుకెళ్లిన బం గారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 


యూట్యూబ్‌లో వీడియోలను పరిశీలించి

మహిళను హత్య చేయడానికి నిందితులు ముం దుగా యూట్యూబ్‌లో నేరాలకు చెందిన వీడియోల ను క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య ఎలా చేయ డం!? చేసిన తర్వాత ఎలా తప్పించుకోవడం!? వం టి వీడియోలను గంటల తరబడి చూశారు. ఆ త ర్వాత పలు సినిమాలు సైతం చేసి.. వాటి ద్వారా స్ఫూర్తి పొంది హత్య చేసినట్లు నిందితులు పోలీసు ల విచారణలో వెల్లడించారు. 

Updated Date - 2020-03-12T11:33:29+05:30 IST