రూ.కోటితో బెల్లాల్ కాలువల ఆధునికీకరణ
ABN , First Publish Date - 2020-12-07T06:13:42+05:30 IST
బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ చెరువు ఆ ధునీకరణ పనులను కోటి రూపాయలతో చేపడుతున్నట్లు ఎమ్మెల్యే షకీల్ తెలిపారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్
బెల్లాల్ చెరువు కాలువల పరిశీలన
బోధన్, డిసెంబరు 6 : బోధన్ పట్టణ శివారులోని బెల్లాల్ చెరువు ఆ ధునీకరణ పనులను కోటి రూపాయలతో చేపడుతున్నట్లు ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. ఆదివారం బెల్లాల్ చెరువును ఆయన పరిశీలించారు. బెల్లాల్ చెరువు కాలువలు దెబ్బతినడం వల్ల రైతులకు సాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. పైప్‌లైన్‌ల లీకేజీలతో నీరు వృథా పోతోందని తెలిపారు. రైతుల కోరిక మేరకు బెల్లాల్ కాలువల ఆధునీకరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. బెల్లాల్ చెరువు కింద సుమారు 3వేల ఎకరాల ఆయకట్టు ఉందని, వీరందరికీ నీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం యాసంగి పంటకు రైతులకు ఇబ్బందులు లేకుం డా నీరు అందించి ఆ తరువాత ఎంఎస్‌పీ పైప్‌లతో పైప్‌ల ఆధునీకరణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను జనవరి నాటికి లబ్ధిదారులకు కేటాయింపు జరుగుతుందని అన్నారు. త్వరలోనే మరో 700 ఇళ్ల నిర్మాణాలను ప్రారం భించనున్నట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు గిర్దావ ర్ గంగారెడ్డి, తూము శరత్‌రెడ్డి, శరత్ తదితరులున్నారు.
కార్యకర్తల కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే షకీల్
బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆదివారం పలువురు కార్యకర్తల కుటుంబాలను కలిశారు. బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి రుద్రూరు మండలం రాయకూర్ శివారులో ఓ శుభకార్యం నిర్వహించగా కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. ఆయనతోపాటు ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, సీఐలు అశోక్‌రెడ్డి, రామన్, తహసీల్దార్ గఫర్‌మియా, టీఆర్‌ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, గిర్ధవార్ గంగారెడ్డి, బొర్ర గంగయ్య, షకీల్, పార్టీ ఎంపీటీసీలు సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.