ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2020-03-13T11:59:49+05:30 IST

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడు దలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ల

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

మొదటి రోజు నామినేషన్‌లు నిల్‌

ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరణ

నిజామాబాద్‌ జిల్లా పరిధిలో 3, కామారెడ్డి జిల్లా పరిధిలో 3 కేంద్రాల ఏర్పాటు

నామినేషన్లు వేసే అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్న కలెక్టర్‌ నారాయణరెడ్డి


నిజామాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడు దలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ల స్వీకరణకు ఏర్పా ట్లను చేశారు. ఈనెల 19వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థుల కో సం జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లను చే శారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఉప ఎ న్నిక కోసం నోటిఫికేషన్‌ను గురువారం రిట ర్నింగ్‌ అధికారి కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి వి డుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఏ ర్పాట్లను చేశారు. నామినేషన్లను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వ రకు కొనసాగుతుందని తెలిపారు. శనివారం, ఆదివారం మినహా ఈనెల 19 వరకు నామి నేషన్‌ స్వీకరణ ఉంటుందని ప్రకటించారు. ఈనెల 20న నామినేషన్లను పరిశీలిస్తామని తెలిపారు. ఈనెల 23వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంటుందని తెలిపారు. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల ను ప్రకటిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 7న ఉ మ్మడి జిల్లా పరిధిలోని ఆరు కేంద్రాలలో పో లింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 9న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తా మని ఆయన నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా నామినేషన్లువేసేందుకు అన్ని రకాల ఏర్పా ట్లను చేశామని కలెక్టర్‌ తెలిపారు. 


కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు..

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా నిజా మాబాద్‌ కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. నామినేషన్‌ వేసేందుకు వచ్చే అభ్యర్థుల కోసం కావాల్సిన సమాచారాన్ని అందించేం దుకు అధికారులను అందుబాటులో ఉంచారు. ప్రధాన గేట్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పా టు చేశారు. 


నిబంధనలు పాటించాల్సిందే..

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోం నామినేషన్లు వే సే అభ్యర్థులు తప్ననిసరి నిబంధనలు పా టించాలని తెలిపారు. నామినేషన్‌ వేసే అభ్య ర్థి ఫారం-2ఇ పూర్తిచేసి సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలన్నారు. ఎమ్మెల్సీగా పోటీచేసే అభ్య ర్థి ఎస్సీ, ఎస్టీ అయితే 5వేల రూపాయలు, బీ సీ, ఓసీ అయితే 10వేల రూపాయలు చెల్లిం చాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్‌ వేసే ప్రతీ అభ్యర్థికి పది మంది ప్రతిపాదకులు ఉండాలన్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థి రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం లోనైనా తప్పనిసరి ఓటరు అయి ఉండాలని తెలిపారు.


దీనికి సంబంధించిన ఓటరు కా ర్డు సమర్పించాలన్నారు. నామినేషన్‌ వేసే అ భ్యర్థి తన అఫిడవిట్‌లో ఫారం 26లో పూర్తి చేసి ఇవ్వాలన్నారు. రాజకీయ పార్టీల తరపు న పోటీ చేసే అభ్యర్థులు ఫారం ఎ, ఫారం బీ సమర్పించాలన్నారు. ఇటీవల దిగిన పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలు ఇవ్వాలని కోరారు. నా మినేషన్‌ వేసే సమయంలో నలుగురు ప్రతి పాదకులు, మూడు వాహనాలను మాత్రమే లోనికి అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. అ భ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరువాలని పేర్కొన్నారు. 


మొదటి రోజు నిల్‌..

ఈ ఉప ఎన్నిక కోసం నోటి ఫికేషన్‌ విడుదల అయినా నామినేషన్లు మాత్రం దాఖలు కాలేదు. అ ధికార పార్టీతో పాటు ప్రతి పక్ష పార్టీల తరపున అభ్యర్థులు ఖరారుకాకపోవడంతో నామినేష న్లు వేయలేదు. బీజేపీ నేతలు మాత్రం దర ఖాస్తు ఫారాలను తీసుకువెళ్లారు. ఈనెల 19 వరకు గడువు ఉండటంతో రాష్ట్ర పార్టీల నిర ్ణయం తరువాత నామినేషన్లు వేసే అవకాశం ఉందని ఆయా పార్టీల సమాచారం బట్టి తెలుస్తోంది.


ఆరు కేంద్రాల ఏర్పాటు..

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం ఆరు పోలిం గ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామా బాద్‌ జిల్లా పరిధిలో 3 కేంద్రాలు, కామారెడ్డి జిల్లా పరిధిలో 3కేంద్రాలను ఏర్పాటు చేశా రు. ఈ  ఎన్నికల్లో మొత్తం 824మంది ఓట ర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 


ప్రత్యేక అధికారుల నియామకం..

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రత్యేక అధికారులను నియమించారు. ఎమ్మెల్సీ ఎన్ని కలలో ఖర్చులను పరిశీలించడంతో పాటు బందోబస్తు, నిఘా, ఇతర ఏర్పాట్ల కోసం ప్ర త్యేక అధికారులను నియమించారు. వీరితో పాటు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను ని యమించారు. మోడల్‌ కోడ్‌ అమలు చేయ డంతో పాటు అభ్యర్థుల ప్రచారాన్ని వీడియో తీసేందుకు ప్రత్యేక బృందాలను నియ మించారు.


మీడియా, ఎంసీసీ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ 

నిజామాబాద్‌ అర్బన్‌:  స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎన్నికల ను పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్‌లోని క్రీడల భవనం లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీ డియా కేంద్రాన్ని, ఎన్‌ఐసీ వీడి యో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రవర్తనా నియామవళి, ఎన్నికల ఖర్చు మాని టరింగ్‌ కమిటీ కేంద్రాలను కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా  డుతూ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్‌ ప్రతిని బుధవారం  విడుద ల చేశామని దీనిపై ఈనెల 17వ తేది సా యంత్రం 5.00 గంటల వరకు అభ్యంతరా లు సమర్పించుటకు లేదా అర్హులైన  ఎవరై నా ఓటర్లుగా పేరు నమోదుకు అవకాశం ఉంటుందన్నారు.


ఈనెల 19 వరకు నా మినేషన్‌లు స్వీకరించేందుకు చర్యలు తీసు కుంటున్నామని రెండో శనివారం, ఆదివా రం మినహా మిగతా రోజులలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ఎన్నికను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందు కు, ఎన్నికల నియమావళిని పక్కగా అమ లు జరిగేలా ఎంసీసీ, ఎంసీఎంసీ తదితర క మిటీలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయడం తో పాటు అన్ని మండలాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించామన్నారు.


అభ్యర్థు లు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటిస్తూ ప్రచారానికి ముం దస్తు అనుమతి పొందాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు, భవనాలలో ఎటువంటి  ప్రచారం నిర్వహించవద్దని, ప్రైవేట్‌  ప్రచారాల సం బంధించిన యాజమాన్యాల నుంచి అనుమ తి పొందాలని సంబందిత వివరాలను ఖ ర్చుల కమిటీకి నివేధించాలన్నారు. ఈ కార్య క్రమంలో ఎంసీసీ, ఎంసీఎంసీ కమిటీల నో డల్‌ అధికారి సింహాచలం, మీడియా ఇన్‌ఛా ర్జి  రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


నేడు నేతలతో సమావేశం..

ఏప్రిల్‌ 7న జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక సంద ర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సి.నారా యణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద యం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ప్రతినిధులు ని ర్ణీత సమయానికి హాజరుకావాలన్నారు. 


ప్రచారానికి అనుమతి తప్పనిసరి..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్ర చారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని ఎంసీసీ నోడల్‌ అదికారి సిం హాచలం తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ని ఎంసీఎంసీ నోడల్‌ అదికారి రామ్మోహన్‌ రావుతో కలిసి ప్రింటింగ్‌ ప్రెస్‌, ఎంఎస్‌వో లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సభలు, స మావేశాలకు అనుమతి తీసుకోవడంతో పా టు ప్రచార సామగ్రి ముద్రణకు సంబంధిం చిన ఖర్చులు నోడల్‌ అధికారికి సమర్పిం చాలని, ఎలకా్ట్రనిక్‌ మీడియా ద్వారా ప్రచా రం నిర్వహించుకునే అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.

Updated Date - 2020-03-13T11:59:49+05:30 IST