ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
ABN , First Publish Date - 2020-12-02T05:23:56+05:30 IST
కోస్లీకి చెందిన 29 ఏళ్ల రాథోడ్ అరుణ మహిళ తన ఇద్దరు పి ల్లలతో సహా గత నెల 25న అ దృశ్యమైందని ఎస్సై యాకూబ్ తెలిపారు.

నవీపేట, డిసెంబరు 1: కోస్లీకి చెందిన 29 ఏళ్ల రాథోడ్ అరుణ మహిళ తన ఇద్దరు పి ల్లలతో సహా గత నెల 25న అ దృశ్యమైందని ఎస్సై యాకూబ్ తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం శివ తండాకు చెందిన అరుణకు కోస్లీ కి చెందిన శ్యాంరావుతో వివా హం జరిగిందన్నారు. వీరికి ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నార ని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం శ్యాంరావు మృతిచెందగా, రెండు సంవత్స రాల నుంచి అరుణ శివతండాలోని పుట్టింట్లో ఉంటుందని అన్నారు. మం ద్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.