ఆగని నడక

ABN , First Publish Date - 2020-04-26T09:56:24+05:30 IST

లాక్‌డౌన్‌ వారికి ఉపాధి లేకుండా చేసింది.. వలసకూలీలను తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే విధంగా చేసింది.. బతకలేని

ఆగని నడక

లాక్‌డౌన్‌తో ఇంటి బాట పట్టిన వలస కూలీలు

ఎండను సైతం లెక్కచేయకుండా కాలినడకన ప్రయాణం

దాతల సహాయంతోనే ముందుకు 

లాక్‌డౌన్‌  పొడిగిస్తారనే అనుమానంతో సొంత గ్రామాలకు ప్రయాణం 


నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):   లాక్‌డౌన్‌ వారికి ఉపాధి లేకుండా చేసింది.. వలసకూలీలను తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లే విధంగా చేసింది.. బతకలేని పరిస్థితుల్లో వారందరిదీ ఒకే బాట అయింది.. తమ ఊరు చేరడమే లక్ష్యమైంది.. కలో గంజో కు టుంబ సభ్యులతో కలిసే తాగు దా మని.. ఉపాధి కోసం కన్నవారిని, పు ట్టిన ఊరును విడిచి వేల కిలోమీటర్‌ లు వెళ్లిన వారు లాక్‌డౌన్‌తో త ప్పని సరి పరిస్థితుల్లో ఇంటి దారి పట్టారు.. రవాణా సౌకర్యం లేక రోజుల తరబడి నడుచుకుంటూ, సైకిళ్లపై వెళుతున్నా రు. ప్రధాన రహదారుల వెంట పోలీసు లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర దాతలు, జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల వారు అం దిస్తున్న ఆహారాన్ని, సరుకులను స్వీకరిస్తూ ముందు కు సాగుతున్నారు. ఎలాగైనా పుట్టిన ఊరును చేరుకో వాలనే లక్ష్యంతో ఎండను, కాళ్ల నొప్పులను లెక్కచేయ కుండా వెళుతున్నారు. ఊరి వారితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులతో కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నారు. తమ స్వగ్రామాలకు చేరు కునేం దుకు 15 నుంచి నెల రోజులు పట్టే అవకాశం ఉన్నా.. ఎవరూ వెనకడుగు వేయడం లేదు.


లాక్‌డౌన్‌ కారణంగా కామారెడ్డి జిల్లా భిక్కనూ రు నుంచి నిజామాబాద్‌ జిల్లా మెండోర వరకు జాతీయ రహదారిపైన నిత్యం వందల సంఖ్యలో వలస కూలీ లు నడిచి వెళుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌కు చెందిన కూలీలు విధిలేని పరిస్థితిలో తిరుగు పయనమయ్యారు. ఉపాధి వేటలో హైదరాబాద్‌, బెంగళూరుకు వలస వెళ్లిన వా రు నెల రోజులుగా లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో ఉపాధి లేక పూట గడవక కరోనా తీవ్రతతో ఇక్కడ ఉండే పరిస్థితి లేక ఇంటి దారి పట్టారు. కష్టాన్ని ఓ ర్చుకుంటూ 40 డిగ్రీల ఎండలోనూ నడిచి వెళ్తున్నా రు. యువకుల నుంచి మధ్య వయస్కుల వరకు ఎ క్కడ నీడ దొరికితే అక్కడ ఉంటూ, నీళ్లున్న చోట అవ సరాలను తీర్చుకుంటూ ముందుకు పోతున్నారు. కరో నా ప్రభావంతో అక్కడక్కడ అధికారులు ఆపినా వెన కడుగు వేయకుండా వారిని ఒప్పిస్తూ ముందుకు సా గుతున్నారు.


లాక్‌డౌన్‌ మరింత కాలం పెరుగుతుంద నే అనుమానంతో వందల కిలోమీటర్ల దూరాలకు వెళుతున్నారు. ఉన్న డబ్బులు ఖర్చవుతున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను ఆదుకుంటు న్నా అవి తమకు సరిపోవనే భావనతో ఎలాగైనా త మ ఊరికి చేరుకోవాలనే ఆశే మండుటెండల్లో వారిని నడిపిస్తోంది. కరోనా భయం ఉన్నా తమ పుట్టిన ఊ రును చేరుకోవాలనే లక్ష్యంతో పిల్లాజెల్లతో ముందుకే సాగుతు న్నారు. 


ఉపాధి కోసం తాము వందల కిలోమీటర్లు దాటి హైదరాబాద్‌, బెంగళూరుకు వచ్చామని, ప్రస్తుతం పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం ఉండడ ంతో తాము తిరిగి వెళుతున్నామని వలస కార్మికులు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురై నా తమ స్వగ్రామాలకు చేరుకుంటామని ఆత్మవిశ్వా న్ని వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువగా భవన నిర్మా ణంలో పనిచేసే మేస్త్రీలు, పెయింటర్‌లతో పాటు కార్మాగారాల్లో పనిచేసే కార్మికులు ఉన్నారు.


లాక్‌డౌన్‌ ముగిసేలోపు చాలా మంది తమ గ్రామాలకు చేరుకు నే అవకాశం లేకున్నా వారు మాత్రం వెనకడుగు వే యడం లేదు. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పం దించి ఇలాంటి వలస కార్మికులను ప్రత్యేక వాహనా లలో పంపిస్తే వారు ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.


Updated Date - 2020-04-26T09:56:24+05:30 IST