ఎన్ని కష్టాలో
ABN , First Publish Date - 2020-05-13T07:31:43+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో 50 రోజులు గడిచిపోవడంతో

దొరికిన ప్రైవేట్ వాహనమే వలస కూలీలకు దిక్కు
గాల్లో కలుస్తున్న కూలీలు ప్రాణాలు
అనుమతి సరే.. ప్రభుత్వ రవాణా సౌకర్యాలేవీ?
స్వరాష్ర్టాలకు వెళ్లేందుకు వలస కూలీల అవస్థలు
నిత్యం జిల్లా మీదుగా వేల సంఖ్యలో స్వరాష్ర్టాలకు వెళ్తున్న వలస కూలీలు కామారెడ్డి మీదుగా 44వ
కామారెడ్డి, మే 12(ఆంధ్రజ్యోతి)/కామారెడ్డి, మే 12 : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో 50 రోజులు గడిచిపోవడంతో చేసేందుకు పని లేక, తినేందుకు తిండిలేక ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లేం దుకు మొగ్గు చూపుతున్నారు. వలస కూలీలకు వెళ్లేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. వారు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు కల్పించకపోవడం తో వలస కూలీల ప్రయాణంలో వారి బతుకులు పేలిపోతున్నా రు. కామారెడ్డి జిల్లాలో 44వ జాతీయ రహదారి ఉండటంతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, జార్జం డ్ రాష్ర్టాలకు వెళ్లేందుకు ఇదే దారి అనుకూలంగా ఉండటంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పని చేసిన వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సరైన ప్రయాణ సౌకర్యం లేకపోవడ ంతో దొరికిన ప్రైవేట్ వాహనాలే వలస కూలీలకు దిక్కవుతున్నా యి.
మరికొంత మంది కాలినడకన వెళ్తుండగా మరికొందరు యువకులు సైకిళ్లపై నానా తంటాలు పడుతూ స్వగ్రామాలకు వెళ్తున్నారు. వలస కూలీలు ఎన్నో ఆపసోపాలు పడుతూ ప్రయాణం చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మంగళ వారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం దగ్గి వద్ద 44వ జాతీయ రహదా రిపై సికింద్రాబాద్ నుంచి 21 మంది వలస కూలీలు తమ స్వగ్రామమైన చత్తీస్‌గడ్ రాష్ట్రంలోని గడ్వాల్ జిల్లాకు ప్రైవేట్ ట్రాలీ ఆటోలో ప్రయాణి స్తుండగా టైర్ పేలడంతో బోల్తాపడింది. ఈ దుర్ఘ టనలో ఒక వలస కార్మికుడు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది ఒక సంఘ టనే అనుకుంటే పొరపాటే. గత వారం రోజుల క్రితం మహారాష్ట్రలో 17 మంది వలస కార్మికులు రైలు పట్టాలగుండా నడుచుకుంటూ వెళ్తూ రాత్రి కావడంతో అలసిపోయి పట్టాలపైనే పడుకోవడంతో 17 మందిని గూడ్స్ రైలు ఢీ కొనడంతో 17 మంది వలస కార్మికుల బతుకులు గాలిలో కలిసిన సంగతి విధితమే. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక్కచోట కార్మికులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వా లు మాత్రం వలస కార్మికులను క్షేమంగా వారి స్వ గ్రామాలకు తరలించేందుకు చర్యలు తీసు కోవడం లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారి స్వ రా ష్ర్టాలకు వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చే వలస కూలీలకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు
కేంద్ర ప్రభుత్వం వలస కూలీలు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్తలో భాగంగా అప్రమత్తమైంది. పొరుగు రాష్ర్టాలైనా మహారా ష్ట్ర, కర్ణాటకలతో పాటు రాష్ర్ట్ర రాజధాని హైద రాబాద్ నుంచి వచ్చే వలస కూలీలపై జిల్లా అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద యంత్రాంగం మరింత నిఘా పెట్టింది. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చే వలస కూలీలపై దృష్టి పెట్టడంతో పాటు వారి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీస్తోంది. ప్రధానంగా కర్ణాట క, మహారాష్ట్రల జిల్లా అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పటిష్టం చేశారు. ఆ రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చే వలస కూలీలకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు చేసి క్వారంటైన్ స్టాంపింగ్ వేసిన తరువాతనే అనుమతి ఇస్తు న్నారు. ఇదిలా ఉండగా వలస కూలీలు ఆయా రాష్ర్టాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ప్రభుత్వాల పరంగా ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో దొరికిన ప్రైవేట్ వాహ నాల్లోనే ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. వలస కూలీలు ఆయా వారి వారి స్వస్థ లాలకు వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
స్టాంప్ ఉంటేనే అనుమతి
జిల్లాకు పొరుగు రాష్ర్టాలైనా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర ంగా ఉండటం పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదు కావడంతో ఆ రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చే వలస కూలీలు, ఇతర వర్గాల ప్రజలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనా మద్నూర్ సలాబత్‌పూర్, చెక్‌పోస్టుతో పాటు మద్నూర్ మండలం, కర్ణాటక సరిహద్దు ప్రాం తమైనా జుక్కల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బందితో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇతర దేశాలు, రాష్ర్టాలు, జిల్లాల నుం చి వచ్చిన వారి 14 రోజులు, 28 రోజుల క్వారం టైన్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు వారి వారి స్వరాష్ర్టాలకు వెళ్లేందుకు అనుమ తులు ఇవ్వడంతో వీరిపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులైనా మద్నూర్, భిక్కనూరు, జుక్కల్‌లతో పాటు అంతర్ జిల్లా చెక్ పోస్టులు మాచారెడ్డి, సదాశివనగర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు.
మహారాష్ట్ర, హైదరాబాద్‌ల నుంచి వచ్చే వలస కూలీల వివరాలను మద్నూర్ సలాబత్‌పూర్, భిక్కనూ రు చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు నమోదు చేసు కుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలస కూలీలకు ఈ చెక్‌పోస్టుల వద్ద క్వారంటైన్ స్టాంపులు ఉంటేనే అనుమ తి ఇస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వలస కూలీలకు క్వారంటైన్ స్టాంప్ వేసిన తరువాతనే జిల్లాలోకి అనుమతి ఇస్తున్నారు. ఇలా మద్నూ ర్ చెక్‌పోస్టు నుంచి జిల్లాకు వచ్చిన 122 మందిని గుర్తించి క్వారంటైన్ స్టాంప్‌ను వేశారు.
ప్రమాదకరంగా ప్రయాణం
కామారెడ్డి జిల్లా మీదుగా పొరుగు రాష్ర్టాల నుంచి వలస కూలీలు వందలాది మందిగా తరలివెళ్తున్నారు. ఇప్పటికే వలస కూలీలు జిల్లాలోని జాతీయ రహదారుల వెంట పిల్లా జల్లా, మూట ముళ్లెతో నడుచుకుంటూ వందల కిలో మీటర్ల మేర ప్రయాణం సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వలస కూలీలకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చినప్పటికీ ప్రయాణం చేసేం దుకు ప్రభుత్వపరంగా వాహనాలను సమకూ ర్చకపోవడంతో కూలీలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ప్రయాణించే ప్రైవేట్ వాహనాలు, వాణిజ్య, వ్యాపార ట్రక్కు లను ఆశ్రయిస్తూ ఎలాగో అలాగా స్వస్థలాలకు చేరాలనే ఆలోచనతో ఈ వాహనాల్లో కుటుంబ సభ్యులు, తోటి కూలీలతో ప్రమాదకరంగా ప్ర యాణం సాగిస్తున్నారు.
హైదరాబాద్‌లోని వల సకూలీలు దొరికిన ఓ ట్రాన్స్‌పోర్ట్ లోడ్ ఉన్న లారీ మీద సుమారు 70మంది వలస కూలీలు ప్రమాదకరంగా జిల్లా జాతీయ రహదారి మీదు గా ప్రయాణిస్తూ వెళ్లడమే ఇందుకు నిదర్శనం. కామారెడ్డి జిల్లాలో మద్నూర్, భిక్కనూరు వద్ద రెండు అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ రెండు రోజుల పరిధిలో భిక్కనూరు చెక్‌పోస్టు మీదుగా ప్రధానంగా హైదరాబాద్ నుంచి సు మారు 500 వాహనాల్లో 4 వేల మంది వలస కూలీలు మహారాష్ట్ర, నాగ్‌పూర్, రాజస్థాన్ లాం టి రాష్ర్టాలకు తరలివెళ్లారు. అదేవిధంగా మద్నూర్ చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి 220 మంది ఆంధ్రప్రదేశ్‌కు, 198 మంది తెలంగాణకు, 4025 మంది మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, ఇతర రాష్ర్టాలకు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించినట్లు స్థానిక చెక్‌పోస్టు అధికారుల రికార్డుల ద్వారా తెలిసింది. ఇలా ప్రయాణం చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.