ప్రత్యేక బస్సుల్లో సొంత రాష్ర్టాలకు వలస కూలీలు

ABN , First Publish Date - 2020-05-18T09:39:35+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ నడుచుకుంటు, వాహనాల్లో ఇరికి ఇరికి వలసకూలీలు పిల్లాపాపలతో వెళ్లడాన్ని చూసి చల్లించిపోయిన ..

ప్రత్యేక బస్సుల్లో సొంత రాష్ర్టాలకు వలస కూలీలు

 బస్సులను ఏర్పాటు చేసిన ఎన్జీవో

సహకరించిన పోలీసులు

ఎన్జీవోలకు కృతజ్ఞతలు తెలియజేసిన వలసకూలీలు


భిక్కనూరు, మే 17: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ నడుచుకుంటు, వాహనాల్లో ఇరికి ఇరికి వలసకూలీలు పిల్లాపాపలతో వెళ్లడాన్ని చూసి చల్లించిపోయిన హిలింగ్‌ ఫీల్డ్స్‌ ఫౌండేషన్‌(ఎన్జీవో సంస్థ) ప్రతినిధులు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారి స్వస్థలా లకు పంపించే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం సాయం త్రం పోలీసుల సహకారంతో భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద నడుచుకుంటు వెళ్తున్న, వాహనాల్లో ప్రమాదకరంగా వెళ్తున్న వారిని నిలిపి వారి వివరాల ను సేకరించి ప్రత్యేకంగా నాలుగు బస్సులను ఎన్జీవో ప్రతినిధులు ఏర్పాటు చేసి దాదాపుగా 200 మందిని జార్ఖండ్‌, బిహర్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు పంపించారు. టోల్‌ ప్లాజాల వద్ద, ఇతర రాష్ట్రాల బార్డర్ల వద్ద వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో ప్రత్యేకం గా పాస్‌లను అందజేశారు.


ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు తిండి లేక, సరైనా వసతులు లేక నడుచుకుంటు, వాహనాల్లో వెళ్తున్న వారిని బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపించడంతో వారి ఆనందాలను అవ దులు లేకుండా పోయాయి. ఈ మేరకు ఎన్జీవోలకు, పోలీసులకు కృతజ్ఞత లు తెలిపారు. కాగా పలువురు వలసకూలీలకు బిస్కెట్‌ ప్యాకెట్లు, అటుకు లు వాటర్‌ ప్యాకెట్లు అందజేశారు. వలసకూలీలను ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపించిన ఎన్జీవోలకు, పోలీసు యంత్రా ంగానికి వాహనదారులు, ప్రజలు అభినందనలు తెలియజేశారు.


వలసకూలీలకు వైద్యపరీక్షలు

ప్రత్యేక బస్సుల్లో వెళ్తున్న వలసకూలీలకు స్థానిక వైద్య సిబ్బంది ప్రత్యేకంగా వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాష్ట్రాల వారీగా బస్సుల్లో వారిని పంపించారు. వలసకూలీలు సైతం వైద్యపరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వచ్చి పోలీసులకు, ఎన్జీవోలకు, వైద్య సిబ్బందికి పూర్తిగా సహకరించారు.


వలసకూలీలకు తిరిగి డబ్బుల అందజేత

ఇతర రాష్ట్రాల కూలీల వద్ద వాహనదారులు ఒక్కో వ్యక్తి వద్ద రూ.2 వేలు, 3వేలు వసూళ్లు చేసి వారికి తీసుకెళ్తున్నట్లు వలసకూలీల ద్వారా తెలుసుకోని వాహనదారుల వద్ద నుంచి తిరిగి వలసకూలీలకు ఎస్పీ శ్వేతా డబ్బులను ఇప్పించి పెద్దమనసును చాటుకున్నారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించడంతో వలసకూలీల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. వలసకూలీలు ఇబ్బందులు పడుతూ వెళ్తుంటే వారి వద్ద వాహనదారులు అధిక డబ్బులు తీసుకొని తీసుకెళ్లడం పట్ల ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి డబ్బులను తిరిగి ఇప్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంస్థ ప్రతినిధులు, భిక్కనూరు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-05-18T09:39:35+05:30 IST