దుర్కిలో మర్నాగి ప్రత్యక్షం

ABN , First Publish Date - 2020-03-25T16:19:26+05:30 IST

మండలంలోని దుర్కి గ్రామంలో మంగళవారం దుర్గం కిష్టయ్య అనే రైతు ఇంట్లో మర్నాగి ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్థులు ఫారెస్టు అధికారి శ్యాం సుందర్‌కు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మర్నాగీని పట్టుకున్నారు.

దుర్కిలో మర్నాగి ప్రత్యక్షం

నస్రుల్లాబాద్ : మండలంలోని దుర్కి గ్రామంలో మంగళవారం దుర్గం కిష్టయ్య అనే రైతు ఇంట్లో మర్నాగి ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్థులు ఫారెస్టు అధికారి శ్యాం సుందర్‌కు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మర్నాగీని పట్టుకున్నారు. కాగా, ఇందులో మర్నాగి పారిపోగా, దానికి చెందిన నాలుగు పిల్లలు దొరికినట్లు ఫారెస్టు అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్నాగి పిల్లలను పట్టుకుని అడవిలో వదిలి పెడతామన్నారు. కాగా, పిల్లల శబ్దాన్ని విని తల్లి వచ్చి వీటిని తీసుకెళుతుందని వివరించారు. కాగా, మర్నాగి దుర్కి గ్రామానికి రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మర్నాగి పిల్లలను చూసేందుకు గ్రామస్థులు విచ్చేశారు. ఫారెస్టు అధికారులు పట్టుకుని తీసుకుని వెళ్లడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2020-03-25T16:19:26+05:30 IST