మమత హత్య కేసు విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-11T05:06:46+05:30 IST

మండలంలోని న్యావనందిలో పుర్రె మమత హత కేసులో సిట్‌ బృందం గురువారం విచారణ ప్రారంభించింది.

మమత హత్య కేసు విచారణ ప్రారంభం
విచారణ చేస్తున్న సిట్‌ బృందం

సిరికొండ, డిసెంబరు 10 : మండలంలోని న్యావనందిలో పుర్రె మమత హత కేసులో సిట్‌ బృందం గురువారం విచారణ ప్రారంభించింది.    అద నపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌, సంగారెడ్డి సీఐ శివకుమార్‌, ధర్పల్లి సీఐ ప్ర సాద్‌ హైస్కూల్లో సమావేశమయ్యారు. గ్రామానికి చెందిన ఎవరు వచ్చి నా వారి నుంచి వివరాలు తీసుకుంటామని సభ్యులు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హైస్కూల్లోనే ఉండి విచారణ చేశారు. గ్రామానికి చెందిన వారు మమత హత్యకు సంబంధించిన వివరాలు చె ప్పిన వాటిని నోట్‌ చేసుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే విచారణలో త మకు తెలిసిన వి వరాలు చెప్పినట్లు సమాచారం. విచా రణ చేపట్టేకంటే ముందు మమత హత్య జరిగిన స్థలాన్ని అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌ సిట్‌ సభ్యులతో కలిసి పరిశీలించారు.


Updated Date - 2020-12-11T05:06:46+05:30 IST