‘దారి’ద్రం..జిల్లాలో అధ్వానంగా రహదారులు

ABN , First Publish Date - 2020-09-24T08:40:11+05:30 IST

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలే కాకుండా ఆస్తినష్టం సైతం తీవ్రంగానే జరిగింది

‘దారి’ద్రం..జిల్లాలో అధ్వానంగా రహదారులు

చినుకు పడితే రోడ్లన్నీ చిత్తడే..

నాణత్యకు నోచుకోని ప్రధాన రహదారులు

భారీ వర్షాల కారణంగా ధ్వంసం అయిన రహదారులు

జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రహదారులు మరీ దారుణం

పలుచోట్ల రహదారులు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు


కామారెడ్డి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పంటలే కాకుండా ఆస్తినష్టం సైతం తీవ్రంగానే జరిగింది. భారీ వర్షాలు, వరదల తీవ్రతకు పలు ప్రాంతాల్లో రహ దారులు కొట్టుకపోగా మరికొన్ని చోట్ల భారీ గుంతలు ఏర్పడ్డాయి. కిలోమీటర్ల చొప్పున రహదారులు దారుణంగా తయారయ్యాయి. జిల్లాలోని జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో రహదారులు ఎక్కువగా ధ్వంసం అయినట్లు అఽధికారుల సర్వేలో తేలింది. రహదారుల ధ్వంసంతో రూ.కోట్లలోనే నష్టం జరిగినట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ధ్వంసమైన రహ దారులలో మరమ్మతులు చేయకపోవడంతో ఆ మార్గం గుండా ప్రయణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. ప్రధాన రహదారుల పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ రహదారులు మరీ అధ్వానంగా తయారవుతున్నాయి.


జిల్లాలో రహదారులు ఇలా..

జిల్లాలో 3,724 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. వ్యవసా య భూమి 2.80లక్షల హెక్టార్లలో, అటవీభూమి 82,230 హెక్టార్ల లో ఉంది. జనాభా 10 లక్షలకు పైగానే ఉంది. 910 కిలో మీటర్ల వరకు రోడ్డు భవనాల శాఖకు సంబంధించిన రహదారులు ఉండ గా పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించిన రోడ్లు 2,482 కిలో మీ టర్ల వరకు ఉన్నాయి. రాష్ట్ర రహదారులు 145 కిలోమీటర్లు, జిల్లా రహదారులు 420 కిలో మీటర్లు, గ్రామీణ రోడ్లు 343 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ఇందులో నాలుగులైన్ల రహదారులు 12, రెండు లైన్ల రహదారులు 250 అంతర్గత రహదారులు 3 ఉన్నాయి. బీటీ రోడ్లు 885 కిలో మీటర్లు, సీసీరోడ్లు 101 కిలో మీటర్లు, కంకర రోడ్లు 644 కిలో మీటర్లు, మొరం రోడ్లు 319 కిలో మీటర్లు, మట్టిరోడ్లు 459 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి.


భారీ వర్షాలకు రోడ్లు ధ్వంసం

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు తీవ్రంగానే ధ్వంసం అయ్యాయి. సుమారు 175 కిలో మీటర్ల వరకు భారీ వర్షాల కారణంగా రహదారులు ధ్వంసం అయినట్లు అధికా రులు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ తీవ్రత ఎక్కువగా జుక్కల్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జుక్కల్‌ నియోజకవర్గం లో 83 కిలో మీటర్లలో, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 60 కిలో మీటర్లలో, బాన్సువాడలో 26 కిలో మీటర్లలో, కామారెడ్డిలో 6 కిలో మీటర్ల పరిధిలో రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు చెబు తున్నారు. జుక్కల్‌ మండలం హంగర్గా గ్రామం వద్ద వరద తీవ్రతకు బీటీ రోడ్డు కొట్టుకపోవడంతో జుక్కల్‌, మహారాష్ట్రల కు రాకపోకలు నిలిచిపోయాయి. డోన్‌గావ్‌ గ్రామం వద్ద కౌలాస్‌నాలా చెరువుపై రోడ్డు తెగిపోవడంతో సోపూర్‌, కర్ణాట కకు రాకపోకలు నిలిచిపోయాయి.


నాగుల్‌గావు గ్రామ ంలో వరద తాకిడికి బీటీ రోడ్డు కొట్టుకపోయింది. పెద్దఎడ్గి బ్రిడ్జి పక్కన తాత్కాలికమైన మొరం రోడ్డు వరద ఉధృతికి తెగి పోయింది. బిచ్కుంద మండల పరిధిలో బిచ్కుంద, బాన్సు వాడ రోడ్డులో పెద్దదే వాడ బ్రిడ్జి వద్ద తాత్కాలిక మొరం రోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయింది. బిచ్కు ంద, రాజుల్లా రెండు గ్రామాల వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద రోడ్డు తెగిపోయింది. ఎల్లారెడ్డి పట్టణం నుంచి నాగిరెడ్డిపేట్‌ వెళ్లే రహదారిలో వరదల తాకిడికి దారిపొడవునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్‌ వెళ్లే బొగ్గు గుడిసే రహదారి పూర్తిగా ధ్వంసం అయింది. ఈ రహదారుల మీదు గా నిత్యం భారీ వాహనాల రాకపోకలు జరుగుతుండడంతో వర్షానికి భారీ గుంతలు ఏర్పడ్డాయి.


ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు

జిల్లాలోని జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌లలో గ్రామీణ, ప్రధాన రహదారులు, వర్షాల తాకిడికి భారీ గుంత లమయం అయ్యాయి. ఈ మార్గాల గుండా ప్రయాణికులు, వాహనదారులు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు. రహదారుల పొడవునా భారీ గుంతలు ఏర్పడడంతో ప్రమా దాలు చోటు చేసుకుంటాయని వాహనాలు పాడవుతాయని వాహనదారులు మండిపడుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణ కేం ద్రం నుంచి అటు నాగిరెడ్డిపేట్‌, ఇటు బొగ్గుగుడిసే మీదుగా నిజాంసాగర్‌, బాన్సువాడ వెళ్లే మార్గాలు పూర్తిగా ధ్వంసం కావడంతో పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిజాంసాగర్‌ మండల కేంద్రం నుంచి పిట్లం వైపు వెళ్లే రహ దారి సైతం ధ్వంసం అయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిరోడ్లు, వర్షాలకు చిత్తడిగా మారి బురదమయంగా అయ్యాయి. అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితిలో రోడ్లు ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.


నాణ్యతకు పాతర

గత ఏడాది కిందట జిల్లాలో పలు ప్రధాన రహదారులకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా మరమ్మతులు చేపట్టారు. కొన్నిచోట్ల కొత్త రోడ్లు వేశారు. కోట్లాది నిధులను ప్రభుత్వం విడుదల చేసి ధ్వంసం అయిన ప్రధాన రహ  దారులకు మెరుగులు వేస్తూ కొత్త బీటీ, సీసీ రోడ్లు వేయాలంటూ ఆదేశించింది. దీంతో సంవత్సరం కిందట జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవ ర్గాల్లో కోట్లాది రూపాయలతో ప్రధాన రహదారులు కిలో మీటర్ల చొప్పున బీటీ రోడ్లను వేశారు. సంవత్సరం తిరగకము ందే ఆ రోడ్లు గుంతలమయం అయ్యాయి. రోడ్లు వేసే సమ యంలో సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యత పాటించకపోవడం, అధికా రుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా రోడ్లు వేస్తు న్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2020-09-24T08:40:11+05:30 IST