లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2020-05-09T11:17:38+05:30 IST

జిల్లాలో కరోనా ప్రభావం తగ్గలేదని, ప్రజలు మరి కొంత కాలం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని, బ

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి

29 వరకూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు

మాస్కులు ధరించకుంటే చట్టరీత్యా చర్యలు

ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వారు తప్పనిసరి 

హోంక్వారంటైన్‌లో ఉండాలి : కలెక్టర్‌ 


నిజామాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా ప్రభావం తగ్గలేదని, ప్రజలు మరి కొంత కాలం లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని, బ యటకు వస్తే తప్పనిసరి మాస్కులు ధరించాలని కలె క్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు శుక్ర వారం ఆయన వీడియో సందేశశన్ని విడుదల చేశారు. జిల్లాలో ఈనెల 29 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంద న్నారు. ఇప్పటివరకు సహకరించిన విధంగానే ప్రజలు ఇక ముందు కూడా నిబంధనలు పాటించి ఇళ్లకే పరి మితం కావాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా కరోనా వై రస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. అవసరాలకు బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరిం చాలన్నారు.


మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి వ రకు జరిమానా విధిస్తామన్నారు. లాక్‌డౌన్‌ సడలింపు ల్లో భాగంగా ప్రత్యేక బృందాలను నియమించామన్నా రు. వీరంతా జిల్లాలో పర్యటించి చర్యలు చేపడుతార న్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నా రు. అవసరాల నిమిత్తం బయటకు వస్తే భౌతిక దూ రం మీటర్‌ ఉండే విధంగా చూడాలన్నారు. ఎవరైనా మాస్కులు ధరించకున్నా, భౌతిక దూరం పాటించకు న్నా వారికి అవగాహన కల్పించాలన్నారు. షాపులలో, ఇతర ప్రాంతాల్లో ఏవైనా వస్తువులు ముట్టుకుంటే  వెంటనే శానిటైజర్‌ను వినియోగించాలన్నారు. వైరస్‌ క ట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రజల ఇ బ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్రప్రభుత్వా లు కొన్ని సడలింపులను ఇచ్చాయన్నారు.


ఆ సడలింపు లకు అనుగుణంగా చర్యలు తీసుకుంటన్నామన్నారు. నిబంధనలకు అనుగుణంగానే షాపులు తెరిచేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. ఏ, బీ కేటగిరీ షాపుల వారు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా వ్యాపార, వాణిజ్య వర్గాలకు సరి, బేసి సంఖ్య ఆధారంగా షాపులు తెరిచేందుకు అవకా శం ఇచ్చామన్నారు. ప్రతీ రోజు 50 శాతం  షాపులకే అనుమతులు ఉన్నాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అను మతి ఉందన్నారు. దానికి అనుగునంగానే బీ కేటగిరి కింద ఉన్న షాపుల యజమానులు నిబంధనలు పా టించి తెరువాలన్నారు. ప్రతి ఒక్కరూ షాపులకు వచ్చే వినియోగదారులు భౌతిక దూరంగా పాటించే విదంగా చూడాలన్నారు. తప్పనిసరిగా మాస్కులు ఉంటేనే షా పుల్లోకి అనుమతించాలన్నారు. షాపుల వద్ద వైరస్‌ వ్యా ప్తి చెందకుండా చూడాలన్నారు.


ప్రతి షాపులో మార్గ దర్శకాలను పాటించే విదంగా చర్యలు తీసుకోవాలన్నా రు. షాపులకు పెద్దఎత్తున అనుమతించవద్దని కలెక్టర్‌ కోరారు. హోటళ్లు, రెస్టారెంట్‌లు, సినిమా హాళ్లు, టూరి స్ట్‌ ప్రదేశాలకు అనుమతులు లేవన్నారు. ఇతర  రాష్ట్రా ల నుంచి జిల్లాకు వచ్చే వారిని అన్ని పరీక్షల తర్వాతనే అనుమతిస్తామన్నారు. వారందరూ తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలన్నారు. ఇల్లు దాటి బ యటకు వస్తే ప్రభుత్వ క్వారంటైన్‌లకు పంపిస్తామ న్నారు. జిల్లాలో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని కూడా పం పిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ మొదటి విడత విజయ వంతం చేసిన విధంగానే గ్రామ, మండల, జిల్లా ప్రజా ప్రతినిధులందరూ సహకరించాలన్నారు.


అదేరీతిలో ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ పాటించే విధంగా  చూ డాలన్నారు. మొదటి విడతలో స్వచ్ఛంద సంస్థలు, ప్ర జాప్రతినిధులు భోజనాలు సమకూర్చారన్నారు. నిబం ధనలకు అనుగుణంగా స్వచ్ఛంద సంస్థలు మాస్కులు, శానిటైజర్‌లు అందించారన్నారు. వీటి వాడకంపైన అ వగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్‌ కోరారు. ఈనెల 29 వరకు అందరూ లాక్‌డౌన్‌ పాటి స్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుందని కలెక్ట ర్‌ తెలిపారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.


ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

ఖరీఫ్‌లో రైతులకు విత్తనా లు, ఎరువులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. విత్తనాలు, ఎరువుల నిల్వలు తదితర అంశాలపై సం బంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ, ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు విత్తనాలు, ఎరు వులు కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఏమేరకు అవసరమవుతాయో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.


ఎరు వులను నిల్వచేసేందుకు గోదాముల కొరత లేకుండా చూడాలన్నారు. సొసైటీల్లో నిల్వలు గుర్తించి, ఇంకా అ వసరం మేరకు సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఎ రువులు, విత్తనాల మొత్తం బకాయి ఉన్న సొసైటీలు మార్క్‌ఫెడ్‌కు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎరువులకు సంబంధించిన నగదు మొత్తాన్ని పీవోఎస్‌ మిషన్‌ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఏఈవోలు, ఏవోలకు తమ ఏరియాకు సంబంధించి గ్రూపు ఉండాలని, స్టాక్‌ లేని ఏరియాలను గుర్తించి వెంటనే ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌కు సమస్యను వెంటవెంటనే తెలియజేయాలన్నారు. సొసైటీలో రికార్డులు సక్రమంగా నిర్వహించేలా సంబంధిత సీఈవోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖ ర్‌, జేడీఏ గోవింద్‌, డీసీవో సింహాచలం, మార్క్‌ఫెడ్‌ అధికారులు, ఏడీఏలు పాల్గొన్నారు


Updated Date - 2020-05-09T11:17:38+05:30 IST