కరోనా వైరస్‌ కట్టడికే లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-24T08:55:04+05:30 IST

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భయంకర కరోనా వైరస్‌ ను అరి కట్టేందుకే లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ కట్టడికే లాక్‌డౌన్‌

ప్రజలు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

ఇల్లు దాటి బయటకు రావొద్దు

నిత్యావసర వస్తువులకు ఆందోళన చెందొద్దు

వాహనాలు బయటకు తెస్తే సీజ్‌ చేస్తాం

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌, సీపీ


నిజామాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతిని ):  ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భయంకర కరోనా వైరస్‌ ను అరి కట్టేందుకే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలి.  స్వచ్ఛందంగా నిబంధనలు పా టించాలి. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుం టాం. విదేశాల నుంచి వచ్చిన వారు  బయటకు వస్తే క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తాం. నిత్యావసర వస్తువు లకు ఆందోళన చెందవద్దు. అన్నింటిని అందుబాటులో ఉంచాం’ అని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. జనతా కర్ప్యూ లాగానే ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాల న్నారు. కలెక్టరేట్‌లో సీపీ కార్తికేయతో  కలిసి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్త ంగా కరోనా వ్యాధి వణికిస్తుందన్నారు.


ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. దూరం పాటిం చాలన్నారు. రాష్ట్రంలో వ్యాధిని  అరికట్టేందుకే ప్రభుత్వం  లాక్‌డౌన్‌  ప్రకటించిందన్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమ లు చేసేందుకు జీవో నెంబర్‌ 45ను జారీచేసిందన్నారు. జిల్లా యంత్రాంగం ఈ జీవోను క్షేత్రస్థాయి నుంచి అమ లు చేస్తుందన్నారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా జిల్లా లోని ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలన్నా రు.  ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నరు. అవసరముంటే ఒకరిని  బయటకు పంపించి నిత్యావసర వస్తువులను తెప్పించుకోవాలన్నారు. గ్రామం నుంచి జిల్లా కేంద్రం వ రకు ఈ లాక్‌డౌన్‌ కొసాగుతుందన్నారు. దీనికి ప్రజల ందరూ సహకరించాలన్నారు.  ప్రజలు నిత్యావసర వస్తు వుల కోసం ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం నిత్యావసర వస్తువుల షాపులు తెరిచే ఉంటాయన్నారు.


ఇతర షాపులను మా త్రమే మూసివేసి ఉంచుతామన్నారు. బ్యాంకులు, ఏటీఎ ంలు పనిచేస్తాయన్నారు. ఆసుపత్రులు, మందుల షాపు లు ఉంటాయన్నారు. పాలు, కూరగాయలు ఇతర నిత్యావ సర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు అనుమతి ఉందన్నారు.  కూరగాయలు, సరుకుల రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామన్నారు. వీటి కోసం మండల, మున్సిపాలిటి పరిఽధిలో ప్రత్యేక బృందాలను నియమించా మన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లకే పరిమితం కావాలతన్నారు.


వారు బయటకు వస్తే చర్యలు తీసుకుం టామన్నారు.  విదేశాల నుంచి వచ్చిన వారు బయట తిరిగితే వారిని క్వారెంటైన్‌కు తరలిస్తామన్నారు. వారిపైన కేసులు కూడా పెడుతామన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా జిల్లాలోని కూలీలు, పేదల కోసం నాలుగు రోజుల్లో బి య్యాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్టా క్‌ పాయింట్‌కు ప్రస్తుతం బియ్యాన్ని తరలిస్తున్నామన్నా రు. ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యాన్ని అందిస్తామన్నా రు.  ఈ నాలుగు రోజుల్లోపే ప్రతీ కుటుంబానికి 1500 రూపాయలు అందించేందు కు ఏర్పాట్లు  చేస్తున్నామని  కలెక్టర్‌ తెలిపారు. జనతా కర్ప్యూ లాగానే లాక్‌డౌన్‌  ఉన్నన్ని రోజులు ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని కలెక్టర్‌ కోరారు.  


లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు:  సీపీ కార్తికేయ

జిల్లా ప్రజలు లాక్‌డౌన్‌ సందర్భంగా నిబంధనలు ఉల్ల ంఘిస్తే కఠిన చర్యలు చేపడుతామని సీపీ కార్తికేయ అన్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిం చాలన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. అంతర్‌ జిల్లా రోడ్లన్నింటిని మూసివేస్తామన్నారు. గ్రామాలను కూడా కట్టడి చేసి చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామ న్నారు. మహారాష్ట్ర సరిహద్దులను మూసివేశామన్నారు. వాహనాలను అనుమతించడం లేదన్నారు. ప్రభుత్వ వాహనాలు మినహా ఏ వాహనాన్ని అనుమతించమ న్నారు.


ఆటోలు, ఇతర వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేస్తామన్నారు. జిల్లా ప్రజలుప్రతి ఒక్కరూ బాధ్యతగా  వ్యవహరించాలన్నారు. పిల్లలను బయటకు వదలవద్దన్నా రు. నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి ఇస్తామ న్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే కొనుగోలు చేసుకునేందుకు అనుమతి ఇస్తామన్నారు. అత్యవసరం ఉన్న  షాపులు మినహా మిగతావన్ని బంద్‌ చేయాలన్నారు. జిల్లాలో ఇత ర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అవకాశం లేదన్నారు. ప్రజలెవరూ ఇంట్లో బోరు కొడుతుందని బయటకు రావద్దన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని లాక్‌డౌ న్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైరస్‌ వ్యాప్తి అరికట్టాలని సీపీ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో  అదనపు కలెక్టర్‌ లత పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-24T08:55:04+05:30 IST