ప్రారంభమైన లాక్‌డౌన్
ABN , First Publish Date - 2020-03-24T10:45:16+05:30 IST
కరోనా వైరస్ వ్యాపించకుం డా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లా క్‌డౌన్ జిల్లాలో మొదలైంది. జిల్లా అంతటా నాకాబందీ...

- ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు
- సరిహద్దుల మూసివేత
- వాహనాలను రోడ్లపైకి అనుమతించని పోలీసులు
- లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు
నిజామాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యో తి ప్రతినిధి): కరోనా వైరస్ వ్యాపించకుం డా అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లా క్‌డౌన్ జిల్లాలో మొదలైంది. జిల్లా అంతటా నాకాబందీ విధించారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరిహద్దులను మూసివేశారు. ఇతర రాష్ట్రాల వాహనాలను నిలిపివేశారు. అంతర్‌జిల్లా రవాణాను కూడా ఆపివేశారు. ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేస్తున్నారు. ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసిన రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. పోలీ స్‌స్టేషన్‌లకు తరలిస్తున్నారు. నిత్యావసర స రుకుల షాపులు మినహా అన్నింటిని మూసివేశారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రాకుం డా చర్యలు చేపట్టారు. గ్రామాల, మండలాలు, డివి జన్, జిల్లా కేంద్రంలో తనిఖీలను చేపట్టడంతో పాటు ఆసుపత్రికి మినహా ఇతర పనులకు అనుమతించడం లేదు. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కట్టడి చేస్తు న్నారు. జనతా కర్ప్యూ తర్వాత కొంత సడలింపు ఇచ్చి మధ్యాహ్నం నుంచి పెంచారు. అన్ని రోడ్లను మూసి వేశారు. జాతీయ రహదారిపైన కూడా వాహనాలను నిలిపివేశారు. ప్రజలెవరూ రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా రు. జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ సోమవారం మొద లైంది. ప్రభుత్వ కార్యాలయాలు మినహా అన్ని సంస్థ లను మూసివేశారు. నిత్యావసరాల షాపులకు మాత్ర మే అనుమతి ఇచ్చారు. ప్రజలెవరూ బయటకు రావ ద్దని కోరురతున్నారు. అత్యవసర సర్వీసుల అధికారులతో పాటు ఉద్యోగులను అనుమతిస్తున్నా రు. జనతా కర్ప్యూ లాగానే ఎక్కడికక్కడ వాహనాల ను నిలిపివేశారు. జనతా కర్ప్యూ తర్వాత సోమవా రం ఉదయం కూరగాయలు, ఇతర వస్తువులు కొను క్కునేందుకు అవకాశం ఇచ్చినా మధ్యాహ్నంనుంచి ఎక్కడికక్కడే వాహనాలను నిలిపివేశారు.
చెక్‌పోస్టుల వద్ద వాహనాల నిలిపివేత
మహారాష్ట్ర సరిహద్దు అయిన సాలూరా చెక్‌పోస్టు వద్ద వాహనాలు రాకుండా మూసివేశారు. మహారాష్ట్ర నుంచి ఏ వాహనాన్ని అనుమతించడం లేదు. భారీ వాహనాలతో సహా అన్ని వాహనాలను తిప్పి పంపు తున్నారు. పాలు, మందులు, నిత్యావసర వస్తువులైన కూరగాయలు, పప్పులు ఉన్న వాహనాలను మాత్ర మే అనుమతిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కఠిన చర్య లను చేపట్టారు. సరిహద్దు అయిన కోటగిరి మం డలం పోతంగల్, కందకుర్తి మండలం రెంజల్, నవీపేట మండలం యంచ వద్ద కూడా రాకపోకలను నిలిపివేశారు. బార్డర్‌లను మూసివేశారు. వాహనా లను రాకుండా నిరోధించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయి చర్యలను చేపట్టారు. కరో నా వైరస్‌ను నిరోధించేందుకు జనతా కర్ప్యూ లాగానే ఇళ్లకు పరిమితం కావాలని కోరుతున్నారు. జాతీయ రహదారితో పాటు అన్ని రహదారులను మూసివే శారు. నిజామాబాద్ నగరం చుట్టూ చెక్‌పోస్టులను ఏర్పాడు చేశారు. బోధన్, ఆర్మూర్‌ల పరిధిలో కూడా ఈ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో కూడా అంతర్గతంగా బయటకు రాకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు.
వాహనాల సీజ్
జిల్లా వ్యాప్తంగా ఆటోలతో పాటు పలు వాహనా లను పోలీసులు సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్లకు తరలి ంచారు. లాక్‌డౌన్ సందర్భంగా జిల్లాలో బస్సులతో పాటు ఏ వాహనాలుకూడా తిరగడం లేదు. ప్రైవేట్ వాహనాలను అనుమతించడం లేదు. ఆటోలను మొ త్తం బంద్ చేయాలని కోరారు. రోడ్డు మీది కి వచ్చే వాటిని నిలిపివేస్తున్నారు. ఆసుప త్రికి వెళ్లే వాహనా లను మాత్రమే అను మతి ఇస్తున్నారు. నిత్యావసరాల కోసం షాపుల వద్దకు వెళ్లేంత వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావ ద్దని కోరుతున్నా రు. జిల్లాలో జనతా కర్ప్యూతో పాటు లాక్ డౌన్ మొదలుకావడంతో కూరగాయలతో పాటు సరుకుల ధరలు ఒకేసారి పెరిగా యి. బంద్, లాక్‌డౌన్ పేరున వ్యాపారు లు డబుల్ రేట్లను పెంచి అమ్మడం మొద లుపెట్టా రు. నిత్యావసర వస్తువులకు ఎలాంటి అడ్డంకులు లేకున్నా రేట్లు పెంచడంతో అధికారులు దృష్టి పెట్టా రు. మార్కెటింగ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధి కారులతో కమిటిలను వేశారు. ఎక్కువ రేట్లు అమ్మే వారిపైన చర్యలు తీసుకోవడంతో పాటు షాపులను సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘాను పెట్టారు. వా రి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా చూస్తున్నారు. ఎవరైనా బయటకు వెళితే క్రిమినల్ కేసులను పెట్టేం దుకు సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ మొదటి రోజు కావడంతో కొంత సడలింపు ఇచ్చినా మధ్యాహ్నం నుంచి దృష్టిపెట్టిన అధికారులు ఎవరూ బయటకు వచ్చినా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని బయటకు వెళ్లకుండా చూసే బాధ్యతలను ఆయా గ్రామాలకు అప్పగిం చారు. లాక్‌డౌన్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయలు బోసిపోయి కనిపించాయి. ప్రభుత్వం నిర్దేశించిన శాఖ ల ఉద్యోగులు మొత్తం హాజరైనా కార్యక్రమాలు మా త్రం నామమాత్రంగానే కొనసాగాయి. లాక్‌డౌన్ సం దర్భంగా నిత్యావసర వస్తువులకు మాత్రం ఇబ్బ ందులు ఎదురైనా సాయంత్రం వరకు కొంత మేరకు తగ్గాయి. అధికారులు కూరగాయలతో పాటు ఇతర అవసరాలకు కావలసిన వస్తువులను తెప్పించేందుకు ఏర్పాట్లను చేశారు. అధికారులు జిల్లాను పూర్తిగా నిర్బంధించారు. 8 రోజుల పాటు ప్రజలు ఇంటికే పరి మితమయ్యే ఈ కార్యక్రమంలో అందరూ సహకరిస్తే కరోనా వ్యాప్తి అరికట్టే అవకాశం ఉంది.