రేపు జాతీయ లోక్ అదాలత్
ABN , First Publish Date - 2020-12-11T05:00:26+05:30 IST
జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సాయి రమాదేవి తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

నిజామాబాద్ లీగల్, డిసెంబరు 10: జాతీయ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి సాయి రమాదేవి తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేషనల్ లోక్‌అదాలత్‌లో మొత్తం పెండింగ్ రాజీ కేసులు 11,800 ఉండగా అందులో 2184 కేసులకు గాను 1228 కేసులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. మరికొన్నింటికి గురు, శుక్రవారాల్లో నోటీసులు జారీ చేస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కలిపి 17 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ మండలంలో 4, కామారెడ్డిలో 3, బోధన్‌లో 5, ఆర్మూర్‌లో 2, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డిల్లో ఒక్కొ క్క బెంచీ చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఈ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి పాల్గొన్నారు.