ఇంటర్‌ విద్యార్థుల కోసం లొకేటెడ్‌ యాప్‌

ABN , First Publish Date - 2020-02-28T10:59:24+05:30 IST

ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనకుండా ఇంటర్‌ బోర్డు

ఇంటర్‌ విద్యార్థుల కోసం లొకేటెడ్‌ యాప్‌

జిల్లా ఇంటర్‌ విద్యాధికారి నాగరాజు


కామారెడ్డి, ఫిబ్రవరి 27: ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనకుండా ఇంటర్‌ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లను చేసిందని కామారెడ్డి జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష సెంటర్‌ను వెతుక్కోవాల్సిన అవస రం లేకుండా స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్‌ ప్లేస్టోర్‌లో సెంటర్‌ లోకేటె డ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని విద్యార్థి హాల్‌టికెట్‌ నెంబరును ఫీడ్‌ చేయగానే విద్యార్థి పరీక్ష కేంద్రం పేరుతో పాటు ఫొటో రూ ట్‌మ్యాప్‌ తెలియజేస్తుందని ప్రతీ విద్యార్థి ఈ యాప్‌ను డౌన్‌లో డ్‌ చేసుకుని పరీక్ష కేంద్రానికి తేలికగా చేరుకోవాలని ఆయన సూచించారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్‌ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే విద్యార్థులు అడ్మి న్‌ డాట్‌ టీఎస్‌బీఐఈ డాట్‌ తెలంగాణ గవర్నమెంట్‌ డాట్‌ ఇన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్‌పై ఏ ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదని ఆయన తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. 

Updated Date - 2020-02-28T10:59:24+05:30 IST