పేదలకు అండగా ఉందాం : విప్‌

ABN , First Publish Date - 2020-05-17T09:53:30+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భారీ నుంచి విముక్తి కలగాలంటే ముందుగా మనమందరం సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి

పేదలకు అండగా ఉందాం : విప్‌

కామారెడ్డి, మే 16: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భారీ నుంచి విముక్తి కలగాలంటే ముందుగా మనమందరం సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వీలైనంత వరకు బయట తిరగడం మానుకోవాలని ప్రభు త్వవిప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. శనివారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో గ్రామ టీఆర్‌ఎస్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ చేతుల మీదుగా 220 మందికి లక్ష రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీమీ ప్రాంతాల్లో ఉన్నవారికి తోచినంత సహాయం చేస్తూ సామాజిక బాధ్యతను పాటించాలని ఆయన సూచించారు. గత 55 రోజులుగా ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైర స్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జడ్పీటీసీ రమాదేవి, సింగిల్‌విండో చైర్మన్‌ పాత లక్ష్మణ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గోపిగౌడ్‌, మాజీ సర్పంచ్‌ రామాగౌడ్‌, ఎంపీటీసీలు నీలవ్వ, కుమ్మరి అనంతలక్ష్మీ, నిమ్మ మోహ న్‌రెడ్డి, పిప్పిరి వెంకటి, శశాంక్‌, ఫజల్‌, గంగాధర్‌రావు, డైరెక్టర్‌లు గంగాధర్‌ గౌడ్‌, కుమ్మరి లక్ష్మీనారాయణ, అసం శ్రీనివాస్‌, పూసల శ్రీనివాస్‌, కమ్మరి శ్రీని వాస్‌, అనిల్‌రెడ్డి, బత్తుల సంజీవ్‌, బత్తుల నర్సింలు, లక్ష్మారెడ్డి, చెలిమెల భానుప్రసాద్‌, రాజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-17T09:53:30+05:30 IST