నేల తల్లిని కాపాడుకుందాం
ABN , First Publish Date - 2020-12-06T05:12:52+05:30 IST
మనమందరం కలి సి నేలతల్లిని కాపాడుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత అన్నారు. ప్రపంచ నేల ల దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆ ర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడా రు.
పెర్కిట్, డిసెంబరు 5: మనమందరం కలి సి నేలతల్లిని కాపాడుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత అన్నారు. ప్రపంచ నేల ల దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆ ర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడా రు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తయారు చే యాలని తెలిపారు. పట్టణంలోని ప్రతీ వార్డు కు సంబంధించిన ప్రజలు ప్లాస్టిక్, చెత్తను రో డ్లపై వేయకుండా వార్డులకు మున్సిపల్ ట్రాక్ట ర్‌లో వేయాలని తెలిపారు. కార్యక్రమంలో ము న్సిపల్ వైస్‌చైర్మన్ షేక్‌మున్ను, కమిషనర్ శైల జ, రంగన్న, ఆర్‌పీలు పాల్గొన్నారు.
పరిశోధనలు మేలు చేసేలా ఉండాలి
రుద్రూరు: శాస్త్రవేత్తల పరిశోధనలు రైతు ల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా ఉండాల ని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ సూచించా రు. మృత్తిక దినోత్సవం సందర్భంగా శనివారం రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం, ప్రొఫెసర్ జ యశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లా డారు. భూమి సారవంతంగా ఉంటేనే పంట లు బాగా పండుతాయని, అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. దీనిపై రైతులకు అవగా హన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతీ పం టకు ఎకరాకు ఐదు వేల రూపాయలు అం దజేస్తుందన్నారు. బీమా పథకం యాంత్రీకర ణ సాగు, గిట్టుబాటు ధర కల్పిస్తుందని తెలిపారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్ర భుత్వం చూస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఉత్తర తెలంగా ణ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి, డాంట్‌సెంటర్ శాస్త్రవేత్త నవీన్‌కుమార్, రు ద్రూరు పరిశోధన కేంద్ర అధిపతి శ్రీధర్, రు ద్రూరు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
లాభసాటిగా యాంత్రిక సాగు
యాంత్రిక సాగు విధానం లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ తెలిపారు. శనివారం రుద్రూరు మం డలంలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించా రు. అనంతరం రుద్రూరు చెరుకు వరి పరిశో ధన కేంద్రంలో అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్త లతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల వ్య వసాయ అధికారి నగేష్‌రెడ్డి, రుద్రూరు పరిశో ధన కేంద్ర అధిపతి శ్రీధర్ పాల్గొన్నారు.