నస్రుల్లాబాద్‌ అడవిలో చిరుత సంచారం

ABN , First Publish Date - 2020-12-19T05:46:26+05:30 IST

జిల్లాలోని నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

నస్రుల్లాబాద్‌ అడవిలో చిరుత సంచారం
చిరుత పాదముద్రలు

బాన్సువాడ, డిసెంబరు 18: జిల్లాలోని నస్రుల్లాబాద్‌ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం మేకల మందలో ఒక మేక తక్కువ రావడంతో బాన్సువాడ-నిజామాబాద్‌ ప్రధాన రహదారికి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మేకల కాపరులు వెతికారు. మేకను తినిపారేసిన కళేబరం, చిరు త పులి పాదముద్రలు కనిపించాయి. దీంతో పశువుల కాపరులు, స్థానికులు భ యాందోళన చెందుతున్నారు. చిరుత పులి పాదముద్రలున్నా, బోనును ఏర్పాటు చేయకపోవడం, పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడంపై ఫారెస్టు అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చిరుత పులిని పట్టుకునేందుకు ఫారెస్టు అధికారులు బోనులను ఏర్పాటు చేయాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు.

Read more