చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు

ABN , First Publish Date - 2020-11-25T05:38:39+05:30 IST

మండలంలోని తుక్కోజివాడి, పద్మాజీవాడి, భూం పల్లి శివారులో చిరుత సంచరిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు.

చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు
తుక్కోజివాడిలో చిరుత కోసం బోనును ఏర్పాటు చేసిన అటవీశాఖ అధికారులు

సదాశివనగర్‌, నవంబరు 24: మండలంలోని తుక్కోజివాడి, పద్మాజీవాడి, భూం పల్లి శివారులో చిరుత సంచరిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. భూంపల్లి శివారులో లింగంపల్లికి చెందిన వ్యక్తికి  సోమవారం రాత్రి చిరుత కనిపించిందన్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియ జేయగా తుక్కోజివాడిలో బోను ఏర్పాటు చేశారు. కాగా మూడు గ్రామాల ప్రజలు పంట పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు.

Read more