కొలిక్కి వస్తున్న న్యావనంది కేసు

ABN , First Publish Date - 2020-12-21T05:16:53+05:30 IST

police cause

కొలిక్కి వస్తున్న న్యావనంది కేసు
ఆందోళన చేస్తున్న ప్రజలు (ఫైల్‌)

కీలక అంశాలను సేకరించిన సిట్‌ అధికారులు

అవసరమైతే నార్కో అనాలసిస్‌‌ చేసేందుకు ప్రయత్నం

నిజామాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన న్యావనంది మహిళ హత్య కేసును సిట్‌ టీం కొలిక్కి తెస్తున్నది. గ్రామస్థులతో పాటు ఇతరుల నుంచి కీలక అంశాలను సేకరించింది. సాంకేతికత ఆధారంగా పలు అంశాలను ఛే దించిన పోలీసులు నలుగురు లేదా ఐదుగురిని నార్కోటెస్టును చేయా లని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం జిల్లా కోర్టు నుంచి అనుమ తి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెం డు రోజుల్లోనే ఈ కేసును తేల్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

నలుగురు లేదా ఐదుగురికి నార్కో అనాలసిస్‌ 

సాంకేతికత ఆధారంగా ఈ కేసును ఒక కొలిక్కి తేచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా నలుగురు లేదా ఐదుగురిపై దృష్టి కేంద్రీక రించి విచారణ కొనసాగిస్తున్నారు. మొదటి నుంచి గ్రామస్థుల వ్యక్తుల తో పాటు మొబైల్‌ టవర్‌ ఆధారంగా సేకరించిన వివరాల ఆధారంగా ఈ కేసును కొలిక్కి తెస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థులతో పాటు కు టుంబ సభ్యులు, ఇతరుల ద్వారా ఇప్పటికే పలు వివరాలు సేకరించిన పోలీసు అధికారులు త్వరగా తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధికారులు అవసరం అ యితే నలుగురిని లేదా ఐదుగురిని నార్కో అనాలిసిస్‌ ద్వారా విచారణ కొనసాగించేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లా కోర్టు అనుమతి తీసు కోనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఉన్నతాధికారులకు కూ డా సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో కీలక అంశాలను సేకరించిన సిట్‌ అధికారులు చివరగా నార్కో టెస్టుల ద్వారా పూర్తి చే యాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు ఈ కే సు కొలిక్కి వచ్చిందని ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కేసు జఠిలంగా మారడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు త్వరగా తెల్చేందుకు సిట్‌ అధికారులు సిద్ధమయ్యారు. పోలీసులు త్వర గా తేల్చుతే ఇన్ని రోజులు పోలీ సులపై పెరిగిన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. 

అక్టోబరు 3న హత్య
సిరికొండ మండలం న్యావనందిలో అక్టోబర్‌ 3న పుర్రె మమత పట్టపగలు హత్యకు గురైంది. ఈ కేసు రాజకీయంగా మారడంతో నిజామాబాద్‌ రేం జ్‌ ఐజీ శివశంకర్‌ రెడ్డి సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్‌ ఇన్‌ చార్జిగా అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్‌ను నియమించారు. ఆమె  ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. గ్రామస్థులను విచారించారు. హత్య జరిగిన తర్వాత జరిగిన సం ఘటనలు పరిశీలించారు. గ్రామంతో పాటు చుట్టూ ఉన్న ప్రాం తాల్లో విచారణ చేశారు. హత్య జరిగిన రోజు ఆ సమయంలో మొబైల్‌ టవర్‌ ఆధారంగా విచారణ చేపట్టారు. కుటుంబ స భ్యులతో పాటు ఆ సమయంలో ఆన్‌లో ఉన్న సెల్‌ఫోన్ల వివరాలను సేకరించారు. సిట్‌లో నేర పరిశోధనలో అ నుభవం ఉన్న అధికారులను వేయడంతో ఈ కేసు ను అన్ని కోణాల్లో విచారణ చేశారు. పలు అం శాలను సేకరించారు.

Updated Date - 2020-12-21T05:16:53+05:30 IST