అలీసాగర్ రివర్స్‌పంపింగ్ నీటి పరిశీలన
ABN , First Publish Date - 2020-12-20T04:18:06+05:30 IST
visit water supply

బోధన్, డిసెంబరు 19: అలీసాగర్ రివర్స్‌పంపింగ్ నీటిని శనివారం టీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి పరిశీలించారు. ఎడపల్లి మం డలం తాడెం నుంచి అలీసాగర్ నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా 40వ డిస్ర్టి బ్యూటరీ కెనాల్ ద్వారా సరఫరా చేయనున్నారు. శనివారం నుంచి జనవరి 4వ తేదీ వరకు నీటి సరఫరా జరుగనుండడంతో పరిశీలించామని తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ పావని, ఏఈ షరీఫ్, గు త్ప భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ పిట్ల శ్రీరాములు తదితరులున్నారు.
నేటి నుంచి సాగునీరు విడుదల
రెంజల్ : నేటి నుంచి అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా పంటపొలాలకు సా గునీరును విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ డీఈ రమణరావు తెలిపారు. యాసంగికి గానూ ఈ నీటి విడుదలను అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా రెంజ ల్, నవీపేట, ఎడపల్లి మండలాలకు అందజేస్తామని తెలిపారు. రైతుల కోరిక మేరకు ముందుగా నీటి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.