‘నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు’
ABN , First Publish Date - 2020-12-20T04:12:49+05:30 IST
shops visit

మోర్తాడ్, డిసెంబర్19: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్‌లపై పీడీ కేసులు నమోదు చేస్తామని ఏడీఏ మల్లయ్య అన్నారు. శనివారం మండల కేం ద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోర్తా డ్ జాతీయరహదారిపై గల ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను ప రిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు చేసిన విత్తనా లు, పురుగు మందులు, ఎరువులకు సంబంధించి రశీదులు ఇవ్వాలని అన్నారు. విత్తనాలు రైతులకు విక్రయించే ముందు విత్తన మొలకశాతం పరీక్ష ఫలితాల ఆధారంగా అమ్మాలని సూచించారు. డీలర్లు తప్పనిసరిగా స్టాక్ రిజిష్ట్రర్‌తో పా టు ధరల పట్టికను కనబడే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. లైసెన్సు గల డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని అన్నారు.
విత్తనాలు, ఎరువుల తనిఖీ
బాల్కొండ : మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయాధికారి మహేందర్‌రెడ్డి శనివారం తనిఖీ చేశారు. డీలర్‌లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు ఎరువులు విక్రయించాలని అన్నారు. నకిలీవి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
బిల్లులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించవద్దు
బోధన్: బిల్లులు లేకుండా ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్ర యించవద్దని బోధన్ ఏడీఏ సంతోష్ హెచ్చరించారు. శనివారం సాలూర, సా లూర క్యాంప్‌లలో ఎరువులు, పురుగుల మందు దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగు ల మందులకు తప్పనిసరి బిల్లులు తీసుకోవాలన్నారు. రైతు బంధు కోసం కొత్త పాసు పుస్తకాలు వచ్చే రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
సమాచారం ఇవ్వాలి
ఎడపల్లి: నకిలీ పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తే సమాచారం ఇవ్వా లని ఎడపల్లి మండల వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్ తెలిపారు. శనివారం మండలకేంద్రంలోని ఎరువులు విక్రయ దుకాణాలను తనిఖీ చేశారు.
డిచ్‌పల్లి : మండలంలోని ఎరువులు, క్రిమిసంహారక మందులు గ్రోమోర్ ఎ రువుల కేంద్రాలను ఏడీఏ వెంకటలక్ష్మీ, ఏవో రాంబాబు తనిఖీలు చేశారు. ఆమె వెంట వ్యవసాయ విస్తీర్ణాధికారులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి : మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం ఫర్టిలైజర్, ఎరువులు, విత్తనాల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. రికార్డులను తని ఖీ చేశారు. రైతులు విత్తన లైసెన్సులు ఉన్న డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు పాల్గొన్నారు.