ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద మహిళ మృతదేహం

ABN , First Publish Date - 2020-12-29T05:51:35+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి మార్చురీ వద్ద ఆదివారం అర్ధరాత్రి మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెంది రక్తపు మడుగులో పడివుంది.

ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద మహిళ మృతదేహం
రక్తపు మడుగులో పడివున్న మహిళ మృతదేహం

హత్యకు గురైనట్టు అనుమానం

పెద్దబజార్‌, డిసెంబరు 28: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి మార్చురీ వద్ద ఆదివారం అర్ధరాత్రి మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెంది రక్తపు మడుగులో పడివుంది. ఈమెను గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. సంఘటనా స్థలానికి సోమవారం ఒకటో పట్టణ పోలీసులు చేరుకుని ఆధారాలు సేకరించే నిమిత్తం డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. ఈమెను నగరంలోని పాములబస్తీకి చెందిన నూనె శైలజగా పోలీసులు గుర్తించారు. ఈమె చేతిపై కత్తి గాట్లున్నాయని తెలిపారు. ఈమె ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటినుంచి వెళ్లినట్లు కుటుంబీకుల సమాచారం. శైలజకు భర్త సత్యానంద్‌, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త సత్యానంద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-29T05:51:35+05:30 IST