కొప్పర్గలో దేశీదారు పట్టివేత

ABN , First Publish Date - 2020-09-21T07:14:30+05:30 IST

బోధన్‌ మండలం కొప్పర్గ శివారులో ఆదివారం దేశీదారును స్వాధీనపర్చుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. కొప్పర్గ నుంచి నీలాకు వెళ్లే

కొప్పర్గలో దేశీదారు పట్టివేత

బోధన్‌, సెప్టెంబరు 20 : బోధన్‌ మండలం కొప్పర్గ శివారులో ఆదివారం దేశీదారును స్వాధీనపర్చుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ బాల్‌రాజ్‌ తెలిపారు. కొప్పర్గ నుంచి నీలాకు వెళ్లే దారిలో ద్విచక్రవాహనంపై దేశీదారును రవాణా చేస్తున్న ఫైజల్‌బేగ్‌ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగిందని ఆయన వద్ద నుంచి 48 దేశీదారు బాటిళ్లను స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. దేశీదారును రవాణా చేస్తున్న వ్యక్తితోపాటు వాహనాన్ని సీజ్‌ చేశామని సీఐ తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్‌ ఎస్సై మధుసుదన్‌రావు, సిబ్బంది సుదర్శన్‌, శ్రీనివాస్‌లు, ప్రమోద్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T07:14:30+05:30 IST