దోహాఖతర్‌లో కొండాపూర్‌ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-05T05:40:22+05:30 IST

మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన వంచ రవీందర్‌రెడ్డి (46) అనే యువకుడు దోహాఖతర్‌లో నవంబరు 30న మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

దోహాఖతర్‌లో కొండాపూర్‌ వ్యక్తి మృతి

సిరికొండ, డిసెంబరు 4: మండలంలోని కొండాపూర్‌ గ్రామానికి చెందిన వంచ రవీందర్‌రెడ్డి (46) అనే యువకుడు దోహాఖతర్‌లో నవంబరు 30న మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రవీందర్‌రెడ్డి అక్కడి రైడ్‌ ఆండ్‌ షైన్‌ కంపెనీలో విధులు నిర్వర్తిస్తుండగా నవంబరు 22న ప్రమాదం జరిగిందన్నారు. ఆయనను కంపెనీ ఉద్యోగులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ నవంబరు 30న మతిచెందాడన్నారు. ఖతర్‌లో ఉన్న జాగృతి ఎన్‌ఆర్‌ఐ సెల్‌ ఇన్‌చార్జి నందిని, సిరికొండ మండలానికి చెందిన సహచర కార్మికుల సహాయంతో రవీందర్‌ మృతదేహం శనివారం గ్రామానికి వస్తుందని రవీందర్‌రెడ్డి బావ నర్సింహారెడ్డి చెప్పారు. రవీందర్‌రెడ్డికి భార్య, కుమార్తె ఉన్నారు. ధర్పల్లి, సిరికొండ జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్‌, మాన్‌సింగ్‌, పలు గ్రామాల సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

Updated Date - 2020-12-05T05:40:22+05:30 IST