కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-11T04:52:53+05:30 IST

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెన్షన్‌

కామారెడ్డి, డిసెంబరు 10: కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణపై ఆదాయానికి మించి అక్రమాస్తు లు కూడ బెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగుచూడడంతో కేసు నమోదు చేసి కరీంనగర్‌ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలి ంచారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో డీఎస్పీతో కలిపి ముగ్గురు పోలీసు అధికారులు కటకటాలపాలు కాగా ఇప్పటికే సీఐ, ఎస్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు పడింది. తాజాగా కామారెడ్డి డీఎస్‌పీపై రాష్ట్ర పోలీ సు ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో డీఎస్పీ పాత్ర ఏమీ లేదని తేల్చినప్పటికీ ఆయన అక్రమాస్తులపై ఏసీబీ అధికా రులు దృష్టి సారించడంతో హైదరాబాద్‌, రంగారెడి,్డ నల్లగొండ, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తులు బయటపడ్డట్టు సమాచారం. దాదాపు రూ.2,11,84,109 విలువ గల ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ సైతం తమ విచారణలో తేలిందని ప్రకటించారు.

Updated Date - 2020-12-11T04:52:53+05:30 IST