టోల్‌ప్లాజా బూత్‌ను ఢీకొన్న కంటైనర్

ABN , First Publish Date - 2020-12-07T17:12:21+05:30 IST

జిల్లాలోని బిక్కనూర్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.

టోల్‌ప్లాజా బూత్‌ను ఢీకొన్న కంటైనర్

కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూర్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. టోల్ ప్లాజా బూత్‌ను కంటైనర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజా బూత్ పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Updated Date - 2020-12-07T17:12:21+05:30 IST