జిల్లా ఆసుపత్రి అభివృద్ధిపై జడ్పీ చైర్మన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-07-08T09:53:47+05:30 IST
జిల్లా ఆసుపత్రి అభివృద్ధిపై జడ్పీ చైర్మన్ సమీక్ష

ఖిల్లా, జూలై 7: బోధన్‌లోని జిల్లా ఆసుపత్రి అభివృద్ధిపై జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు సమీక్షించారు. మంగళవారం జడ్పీ కార్యాలయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణతో మాట్లాడుతూ, జిల్లా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, కొవిడ్-19 పరిస్థితుల్లో తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను సూ పరింటెండెంట్ అన్నపూర్ణ చైర్మన్‌కు వివరింంచారు. సమావేశంలో ఆమెతో పాటు ఏడీ అరుణ పాల్గొన్నారు.
ఐఎంఏ ఆధ్వర్యంలో హరితహారం
పెద్దబజార్: ఇండియన్ మెడికల్ అసోసియేషణ్ జిల్లా శాఖ ఆధ్వర్యం లో గంగాస్థాన్ ఫేజ్-2లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు పాల్గొని మొక్కలు నా టారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవన్‌రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల విశాల్ ఇతర తదితరులు పాల్గొన్నారు.