ఇసుక రవాణాలో.. ఇష్టారాజ్యం!
ABN , First Publish Date - 2020-11-27T05:42:08+05:30 IST
పగలూ రాత్రి అనే తేడాలే దు.. నిబంధనలు అంతకన్నా పట్టువు.. పరిమితికి మించి లోడ్‌తో రోడ్లపై పరుగులు పెట్టడమే పరమావధిగా.. సాగుతోంది ఇసుక అక్రమ దందా.

బీర్కూర్ క్వారీ నుంచి ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలు, టిప్పర్లు
దెబ్బ తింటున్న రోడ్లు
దృష్టి పెట్టని ఆర్టీఏ, రెవెన్యూ, పోలీసుశాఖలు
బోధన్, నవంబరు 26 : పగలూ రాత్రి అనే తేడాలే దు.. నిబంధనలు అంతకన్నా పట్టువు.. పరిమితికి మించి లోడ్‌తో రోడ్లపై పరుగులు పెట్టడమే పరమావధిగా.. సాగుతోంది ఇసుక అక్రమ దందా. లారీలు, టిప్పర్లలో ఓవర్ లోడ్‌తో రవాణాకు చేస్తున్న ఇసుక మాఫియా. బీ ర్కూర్ ఇసుక క్వారీల నుంచి ఇసుక తరలిస్తున్న వాహ నాలు కోటగిరి, రుద్రూరు, బోధన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇసుక లారీలు, టిప్పర్‌లు ఓవర్‌లోడ్‌తో ఇష్టరాజ్యంగా ప్రయాణిస్తున్నాయి. రాత్రివేళ ఇసుక వాహ నాలు రవాణా చేయకూడదన్న నిబంధన ఉన్నా రాత్రి 10 గంటల వరకు ఇసుక టిప్పర్‌లు, లారీలు ప్ర యాణిస్తున్నాయి. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక టిప్పర్‌లు, లారీల వల్ల రహదా రులు చిద్రం అమవుతున్నాయి. ఓవర్‌లో డ్‌తో వెళ్తున్న ఇసుక వాహనాలను అధికా రులు అడ్డుకోలేకపోతున్నారు. క్వారీల నుం చి నిర్దిష్టమైన లెక్కప్రకారం ఇసుక తర లింపు జరగాల్సి ఉన్న ఓవర్‌లోడ్‌తో ఇసుక రవాణా కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం వాహనాల్లో ఇసుక నింపడంతోపాటు వేబ్రిడ్జిలలో కొలతలు చూడాల్సి ఉన్న ఈ నిబంధనలేవి అమలు జరగడం లేదు. క్వారీల నుంచి అడ్డగోలుగా ఓవర్‌లోడ్‌తో ఇసుక వాహనాలు ఇసుక రవాణా చేపడుతున్నాయి. బీర్కూర్, పోతంగల్, కోటగిరి, రుద్రూరు మీదుగా ఇసుక వాహనాలు బోధన్ నిజామాబాద్‌కు ఇసుక రవాణా జరుగుతోంది. ఓవర్ లోడ్ వాహనాలను ఆర్టీఏ, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారులు అడ్డుకో లేక పోతున్నారు. ఓవర్‌లోడ్ వాహ నాల వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిని రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడు తున్నాయని కోట్లాది రూపాయల విలువైన ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఓవర్‌లోడ్ ఇసుక వాహనాలను నియం త్రించాలని తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.