గిరిజన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-09-29T07:09:35+05:30 IST

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుపే ద నిరుద్యోగ గిరిజన యువతకు నిర్మాణ్‌ సంస్థ సమన్వయంతో ఫ్యూచర్‌ రెడీ యూ త్‌ స్కిల్లింగ్‌ ప్రోగ్రాం ద్వారా 3 నెలల ఆన్‌

గిరిజన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 28: 

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుపే ద నిరుద్యోగ గిరిజన యువతకు నిర్మాణ్‌ సంస్థ సమన్వయంతో ఫ్యూచర్‌ రెడీ యూ త్‌ స్కిల్లింగ్‌ ప్రోగ్రాం ద్వారా 3 నెలల ఆన్‌ లైన్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సం ధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ/బీటెక్‌ సీ ఎస్‌ఈ/ఐటీ/ఈసీఈ, ఎం.టెక్‌ సీఎస్‌ఈ/ఐటీ/ ఈసీఈ, ఎంసీఏ కంప్యూటర్‌సైన్స్‌, బీసీఏ అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నా రు. మూడు నెలల పాటు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇ స్తామని, శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు వెబ్‌ డె వలపర్‌, జావా డెవలపర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ఆండ్రైడ్‌ యాప్‌ డెవలపర్‌, పీహెచ్‌పీ డెవలపర్‌ వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తామ ని, ఆసక్తి గలవారు అక్టోబరు 10లోగా టీఎస్‌ ట్రైబల్‌  వెల్ఫేర్‌.సీజీజీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 90300 55998, 63099 87155 నెంబర్‌లను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-09-29T07:09:35+05:30 IST