న్యాయశాస్త్ర పరిపాలనలో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-16T04:59:07+05:30 IST

2020-21 సంవత్సరానికి గాను షెడ్యుల్‌ తెగలకు(ఎస్‌టీ) చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి న్యాయశాస్త్ర పరి పాలనలో మూడేళ్ల శిక్షణ పొందుటకుగాను అభ్యర్థుల దరఖాస్తు చేసు కోవాలని జిల్లా గిరిజనశాఖఅధికారి అంబాదాస్‌ తెలిపారు.

న్యాయశాస్త్ర పరిపాలనలో శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 15: 2020-21 సంవత్సరానికి గాను షెడ్యుల్‌ తెగలకు(ఎస్‌టీ) చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి న్యాయశాస్త్ర పరి పాలనలో మూడేళ్ల శిక్షణ పొందుటకుగాను అభ్యర్థుల దరఖాస్తు చేసు కోవాలని జిల్లా గిరిజనశాఖఅధికారి అంబాదాస్‌ తెలిపారు. జిల్లాకు ఇద్దరిని ఎంపిక చే స్తారని అందుకు అనుగుణంగా కుల ధ్రువీకరణ పత్రం, అభ్యర్థి తండ్రి లేదా సంరక్షకుని ఆదాయం రూ.రెండు లక్షలకు మించరాదని తెలి పారు. ఈ ఆదాయ ధ్రువీకరణ పత్రం మీసేవ ద్వారా తీసుకున్నది అయి ఉండాలని  తెలిపారు. ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన ధ్రువ పత్రాన్ని జతపర్చాలని సూచించారు. శిక్షణ కాలంలో అభ్యర్థికి నెలకు రూ.1000 చొప్పున, రూ.6000 పుస్తకాలు, ఫర్నిచర్‌ కొనుగోలుకు చెల్లించబడునని తెలిపారు. బుధవారం నుంచి దరఖాస్తు ఫారాలను కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 22 సాయంత్రం 5 గంటలలోపు గిరిజన అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. 

Updated Date - 2020-12-16T04:59:07+05:30 IST